కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న డేనైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ తో భారత అదరగొట్టింది. టాస్ గెలిచి ఎంచుకున్న బంగ్లాకు ఆదిలోనే భారత బౌలర్లు దెబ్బగొట్టారు. నిప్పులు చెరిగే బంతులు వేశారు. దీంతో ఆదినుంచీ బంగ్లా తడబడింది. భారత పేసర్ల ధాటికి కేవలం 24 పరుగులకే బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయింది. భారత్ తరపున పింక్ బాల్ తో తొలి వికెట్ తీసిన భారత బౌలర్ గా ఘనతను ఇషాంత్ శర్మ సాధించాడు. 4 పరుగులు చేసిన ఓపెనర్ ఇర్ముల్ ను ఇషాంత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయి బంగ్లాదేశ్... 17 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. వన్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన మొమినుల్ హక్ (డకౌట్)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. 

 

Image result for డేనైట్ టెస్ట్ మ్యాచ్

 

ఉమేశ్ వేసిన బంతి మొమినుల్ బ్యాట్ ను ముద్దాడుతూ స్లిప్స్ లోకి వెళ్లింది. సెకండ్ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ కుడివైపుకు డైవ్ చేస్తూ, అద్భతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ మిథున్ కూడా డకౌట్ అయ్యాడు. అతన్ని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్ (డకౌట్)ను మొహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇర్ముల్, మొమినుల్, ముష్ఫికర్ ముగ్గురూ వరుసగా డకౌట్ కావడం గమనార్హం. 

 

Related image

 

తరువాత ఉమేష్ మరో వికెట్ ను తీసి బంగ్లాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 50 పరుగులు కూడా దాటకుండానే సగం వికెట్లు కోల్పోయింది బంగ్లా. తరువాత సాహా పట్టిన అద్భుతమైన క్యాచ్ తో మహమ్మదుల్లా కూడా పెవిలియన్ చేరాడు. దీంతో బాంగ్లాదేశ్ అసలు 100 పరుగులైన చేస్తుందా అని అనుకున్నారు. ఈ క్రమంలో లిటన్ దాస్ వేగంగా ఆడడంతో లంచ్ ముందు మరో వికెట్ కోల్పోలేదు. లంచ్ తరువాత లిటన్ దాస్ కి గాయం తగలడంతో బ్యాటింగ్ కు రాలేకపోయాడు. తరువాత ఇషాంత్ అద్భుతమైన బంతితో మరో వికెట్ తీశాడు. తరువాత హాసన్ వికెట్ ఇషాంత్ తీశాడు. మరో వికెట్ తీసి ఇషాంత్ 5 వికెట్లు సాధించాడు. దీంతో పింక్ బాల్ టెస్ట్ లో భారత్ తరపున మొదటి 5 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.  చివరి వికెట్ తీసి షమీ బంగ్లా ఇన్నింగ్స్ ను ముగించాడు.

 

అన్ని వికెట్లు పేసర్లు గీయడం గమనార్హం. భారత బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. ఫీల్డింగ్ లో కూడా భారత్ ఏమాత్రం తప్పిదం చేయలేదు. రోహిత్, పుజారా, సాహా చక్కటి క్యాచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: