భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్కతాలో జరుగుతున్న మొదటి డే / నైట్ టెస్టు కోహ్లీ శతకం చేశారు. పింక్ బాల్ తో మొదటి సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లోనే కెప్టెన్ గా ఐదు వేల పరుగుల మార్క్ ను దాటాడు. ఇప్పటికే భారత్ 150 పరుగుల ఆధిక్యాన్ని దాటేసింది. కోహ్లీ ఇలానే చెలరేగి ఆడితే బంగ్లాకు కష్టాలు తప్పకపోవచ్చు. రహానేతో కలిసి భారత్ ను పటిష్ట పరిస్థితిలో నిలిపాడు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIRAT KOHLI' target='_blank' title='kohli-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kohli</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KOLKATA' target='_blank' title='kolkata-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kolkata</a> test
 
ఈ సెషన్ లో రహానే అవుట్ అయినా కోహ్లీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ శతకంతో టెస్టుల్లో 27 శతకాలు పూర్తి చేసుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. 


అంతక ముందు భారత బౌలర్ల దాటికి బంగ్లా 106 పరుగులకే కుప్పకూలిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ 5 వికెట్లు తీసి పింక్ బాల్ తో మొదటి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలిన పుజారా, రహానే, కోహ్లీ అర్థ శతకాలతో ఇన్నింగ్స్ ను నడిపించారు. మొదటి రోజు పుజారా వికెట్ పడ్డాక వచ్చిన రహానే కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చారు. తర్వాత రహానే అవుట్ అయినా కోహ్లీ మాత్రం తనదైన శైలిలో ఆడాడు. ఈ క్రమంలో పింక్ బాల్ తో జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. 

 

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సృష్టించాడు. నిన్నటి ఆటలో కెప్టెన్‌ గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని సాధించి రికార్డు నమోదు చేసిన కోహ్లి. ఈరోజు ఆటలో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాధించిన హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకున్న కోహ్లి భారత్‌ లో జరుగుతున్న తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు కెక్కాడు. ఓవర్‌ నైట్‌ ఆటగాడిగా దిగిన కోహ్లి 159 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ సాధించాడు. ఈరోజు భారత్‌ ఇన్నింగ్స్‌ను రహానే, కోహ్లిలు ఓవర్‌ నైట్‌ ఆటగాళ్లుగా కొనసాగించారు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIRAT KOHLI' target='_blank' title='kohli-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kohli</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KOLKATA' target='_blank' title='kolkata-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kolkata</a> test

కాగా కోహ్లికి ఇది టెస్టుల్లో 27వ సెంచరీ కాగా, ఓవరాల్‌ గా అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ శతకం. వన్డేల్లో ఇప్పటివరకూ కోహ్లి 43 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.  భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో భోజన సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(14), రోహిత్‌ శర్మ(21), చతేశ్వర్‌ పుజారా(55), రహానేలు పెవిలియన్‌ చేరారు. ప్రస్థానికి క్రీజులో కోహిలి 130, జడేజా 12 పరుగులతో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: