కొలకత్తా లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కి  ఓ ప్రత్యేకత ఉందన్న   విషయం తెలిసిందే. మొదటిసారి పింక్ బాల్ తో  క్రికెట్ ఆడుతున్నారు ఆటగాళ్ళు . మొదటిసారి పింక్ బాల్ తో  ఆడుతుండగా...  కొల్ కత్తా నగరాన్ని మొత్తం పింక్ మయంగా మార్చారు . కొల్ కత్త నగరంలోని భావనాలన్నింటిని పింక్ వెలుగులతో నింపేశారు.ఇదిలా ఉండగా   కొల్ కత్త  వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో   టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విస్మయం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు ను 9 వికెట్లకు 347 పరుగుల వద్ద డిక్లేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ.అప్పటికి  ఇండియా టీం 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే భారత బౌలర్ల ప్రదర్శన పట్ల పూర్తి విశ్వాసం ఉండడంవల్లే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని టెస్ట్ సిరీస్ నుంచి శమి బుల్లెట్ లాంటి బంతులకు విసురుతుండగా.. ఉమేష్ యాదవ్, ఇషాంత్  కూడా భారీ వికెట్లను పడగొడుతున్నారు . ఇక స్పిన్నర్స్ కూడా తమ స్పిన్ తో  మాయ చేసి వికెట్లను కొల్లగొడుతున్నారు. 

 


 ఈ క్రమంలో షమీ,  ఉమేష్, ఇషాంత్  లాంటి  టీమిండియా ఫేసర్లు,  స్పిన్నర్లు ను ఎదుర్కొని రెండు వందల పైచిలుకు పరుగులు చేయడం కూడా బంగ్లాకు కాస్త కష్టమైన పనే . ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో  105 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట తొలి సెషన్ లో  కోహ్లీ (136) సెంచరీతో హైలెట్ గా నిలిచారు. పింకు బాల్  ఎదుర్కోవడం కోహ్లీకి మొదటిసారి అయినప్పటికీ ఎంతో పట్టుదలతో అద్భుత ప్రదర్శనతో శతకం సాధించి పెట్టాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. అంతకుముందు రహానే (51) జడేజా (12)తో  వెనుతిరిగారు. ఇక  బంగ్లా బౌలర్లలో అమీన్3, ఇబాదత్ 3, అబూ జాయేద్ 2  వికెట్లను పడగొట్టారు. ఇదిలా ఉండగా టీమ్ ఇండియా వరుసగా టెస్ట్ సిరీస్ లను  గెలుచుకుంటూ దూసుకుపోతున్న  విషయం తెలిసిందే. 

 


 తాజాగా టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ల విజయాలలో  సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ లో ఎక్కువ విజయాలను సాధించిన కెప్టెన్లలో మొదటి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ . అయితే కోహ్లీ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ 9 టెస్ట్ సిరీస్ల విజయాలతో ముందు వరుసలో ఉండగా... తాజా టెస్టు సిరీస్ విజయంతో 10 టెస్ట్ సిరీస్లకు కెప్టెన్గా విజయాలు అందించి ధోనిని  వెనక్కి నెట్టి ముందువరుసలో నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్లో భారీ స్కోరును నెలకొల్పతున్నారు. అంతే కాకుండా టీమిండియా ఆటగాళ్లు అందరూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ టీమ్ ఇండియా విజయాలకు బాటలు  వేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: