ఎర్ర బంతి , తెల్ల బంతుల క్రికెట్ లో  సెంచరీల మీద సెంచరీలు బాది రికార్డుల ఎర్ర బంతి , తెల్ల బంతుల క్రికెట్ లో  సెంచరీల మీద సెంచరీలు బాది రికార్డుల మీద రికార్డుల సృష్టించిన  టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ...  తాజాగా   గులాబీ బంతి తో జరుగుతున్న టెస్ట్  లో కూడా    సెంచరీ చేసి   సత్తా చాటాడు.   ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో  జరుగుతున్న  డే అండ్ నైట్ టెస్ట్ లో  కోహ్లీ  136పరుగులతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో   కోహ్లీ  పలు  రికార్డులు  సృష్టించాడు.  అందులో  భాగంగా  అంతర్జాతీయ క్రికెట్ లో  70 అంత కన్నా  ఎక్కువ సెంచరీలు  సాధించిన మూడో  బ్యాట్స్ మెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మీద రికార్డుల సృష్టించిన  టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ...  తాజాగా   గులాబీ బంతి తో జరుగుతున్న టెస్ట్  లో కూడా    సెంచరీ చేసి   సత్తా చాటాడు.   ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాంగ్లాదేశ్ తో జరుగుతున్న  డే అండ్ నైట్ టెస్ట్ లో  కోహ్లీ  136పరుగులతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో   కోహ్లీ  పలు  రికార్డులు  సృష్టించాడు.  అందులో  భాగంగా  అంతర్జాతీయ క్రికెట్ లో  70 అంత కన్నా  ఎక్కువ సెంచరీలు  సాధించిన మూడో  బ్యాట్స్ మెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 

 

ఈజాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్  టెండుల్కర్  100 సెంచరీలతో  మొదటి స్థానంలో  ఉండగా  ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్  71 శతకాలతో  రెండో స్థానంలో  వున్నాడు. 70శతకాలతో  కోహ్లీ మూడవ స్థానంలో  కొనసాగుతున్నాడు.  అలాగే  కెప్టెన్ గా కోహ్లీ కి  ఇది 41వ సెంచరీ .. తద్వారా  అంతర్జాతీయ క్రికెట్ లో  అత్యధిక  సెంచరీలు చేసిన   ఆటగాడిగా కోహ్లీ , పాంటింగ్  సరసన నిలిచాడు.  ఈఘనత  సాధించడానికి   పాంటింగ్ కు  376 ఇన్నింగ్స్  లు  అవసరం కాగా    కేవలం  188 ఇన్నింగ్స్ ల్లోనే  ఈ ఫీట్  సాధించి అదుర్స్  అనిపించాడు కోహ్లీ.   ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో ప్రస్తుత టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ , ఆసీస్‌ స్టార్  క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను కోహ్లి దాటేశాడు. కోహ్లి టెస్టుల్లో 27 సెంచరీలు సాధించి గ్రేమ్‌ స్మిత్‌, అలెన్‌ బోర్డర్‌లు తో కలిసి టెస్టు ఆటగాళ్ల జాబితాలో 17వ స్థానంలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: