కోల్కతా లో జరుగుతున్న డేనైట్ టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పింక్ బాల్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాంత్ శర్మ బంగ్లా పతనాన్ని శాసించాడు. డేనైట్ టెస్టులో పింక్ బాల్ తో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లు తీసి పింక్ బాల్ తో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టు పెవిలియన్ కు క్యూ కట్టారు. అతని తోడు ఉమేష్ యాదవ్, షమీ రాణించడంతో పేసర్లే 10 వికెట్లు తీశారు. ఇండియా పిచ్ మీద భారత పేసర్లు పది వికెట్లు తీయడం విశేషం.

 

Image result for today ind vs ban test match

   తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కు మొదట్లోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న మయాంక్ వికెట్ కోల్పోయింది భారత్. తరువాత రోహిత్ వికెట్ తీసి బంగ్లా బౌలర్లు ఆనంద పడ్డారు. కానీ ఆ ఆనందాన్ని కోహ్లీ, పుజారా ఎక్కువ సేపు ఉంచలేదు. వీరిద్దరూ చక్కటి బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. పుజారా వికెట్ పడ్డాక వచ్చిన రహానే కోహ్లీకి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చారు. తరువాత రహానే వికెట్ పడిన కూడా కోహ్లీ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో డేనైట్ టెస్టులో భారత్ తరపున మొదటి సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లోనే కెప్టెన్ గా 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. 136 చేసి పెవిలియన్ చేరాడు. 347 దగ్గర మరో వికెట్ ఉండగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసాడు.

Image result for today ind vs ban test match

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించేందుకు వచ్చిన బంగ్లాదేశ్ ను మరో సారి ఇషాంత్ శర్మ దెబ్బ కొట్టాడు. నిప్పులు చెరిగే బంతులు వేసి బ్యాట్స్ మెన్ ను క్రీజులో నిలవనివ్వకుండా చేసాడు. బంగ్లా ఖాతా తెరవకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. ఇస్లాంను డక్ అవుట్ చేసి ఇషాంత్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. తరువాత కూడా అద్భుతమైన బంతులతో మరో రెండు వికెట్లు తీసాడు. అతనితో పాటు ఉమేష్ కూడా రాణించడంతో రెండో రోజే మ్యాచ్ ముగిస్తుందేమో అనిపించింది. 

Image result for today ind vs ban test match

 

కానీ రహీమ్, మహమ్మదుల్లా కొద్దీ సేపు పోరాడారు. మహమ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. రహీమ్ అద్భుతంగా పోరాడడంతో మ్యాచ్ మూడో రోజుకు వచ్చింది. రోజు ముగుస్తుంది అని అనుకున్న సమయంలో ఉమేష్ ఇస్లాంను పెవిలియన్ చేర్చి మ్యాచ్ ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తెచ్చాడు. మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మిగితా వికెట్లు తీయడానికి భారత బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ మ్యాచ్ లో అన్ని వికెట్లు పేసర్లే తీయడం విశేషం. మొదటి ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన ఇషాంత్ రెండో ఇన్నింగ్స్ లో కూడా బంగ్లా పతనాన్ని శాసించాడు. అతనికి తోడు ఉమేష్ కూడా రాణించడంతో బంగ్లా మూడో రోజు గంటలోనే మ్యాచ్ అయిపోయింది.      

 

స్కోర్ వివరాలు: బంగ్లా మొదటి ఇన్నింగ్స్: 106, భారత్ మొదటి ఇన్నింగ్స్:  347 - 9 డిక్లేర్, బంగ్లా రెండో ఇన్నింగ్స్: 195

మరింత సమాచారం తెలుసుకోండి: