టీమిండియా కెప్టెన్  కింగ్  కోహ్లి టెస్టు క్రికెట్ లో   అరుదైన  ఘనతలను  సొంతం చేసుకున్నాడు.  అవేంటంటే ..  బంగ్లాదేశ్  తో జరిగిన  పింక్  బాల్  టెస్ట్ ను  గెలుచుకోవడంతో  టెస్టు ఫార్మాట్ లో  అత్యధిక  విజయాలను  సాధించిన  కెప్టెన్ల   జాబితాలో కోహ్లి   5వ స్థానంలో  నిలిచాడు. ఈజాబితాలో సౌతాఫ్రికా  మాజీ సారథి  గ్రేమ్ స్మిత్ 53విజయాలతో మొదటి స్థానంలో ఉండగా ఆసీస్ దిగ్గజాలు  పాంటింగ్ 48 , స్టీవా 41 , అలాగే   వెస్టిండీస్  లెజండరీ ఆటగాడు క్లైవ్ లాయిడ్  36 విజయాలతో  తరువాతి స్థానాల్లో వున్నారు.  తాజాగా  కోహ్లి 33 విజయాలతో   అలెన్ బోర్డర్ ను వెనక్కి నెట్టి  ఈ జాబితాలో  5 వస్థానంలో  కొనసాగుతున్నాడు. 


 
ఈనేపథ్యంలో కోహ్లి ,  ధోని పేరిట వున్నా రికార్డు ను కూడా  చెరిపేశాడు.   ధోని   సారథ్యంలో టెస్టుల్లో   టీమిండియా వరసగా  6విజయాలను  నమోదు చేయగా తాజాగా  బంగ్లాదేశ్  తో జరిగిన డే  నైట్ టెస్ట్ విజయంతో  కెప్టెన్  గా భారత్ కు  కోహ్లీ   వరుసగా ఏడు విజయాలను అందించడంతో  వరుసగా  అత్యధిక విజయాలు సాధించిన  భారత  కెప్టెన్ గా కోహ్లి  ఘనత సాదించాడు.  కాగా  2013 సీజన్ లో  ధోని   నేతృత్వం లో భారత్ వరుసగా  6 టెస్టుల్లో  గెలుపొందింది.  ఇక  టెస్టులో  వేగంగా  5000 పరుగులు చేసిన  టెస్టు కెప్టెన్ గా కూడా  కోహ్లి రికార్డు  సృష్టించాడు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: