ఐపీఎల్ లో  చెన్నై  సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్  ఎంతటి  బలమైన జట్లో మనకు తెలిసిందే. ఈరెండు  టీం లలో ఏ టీం కు  ఆడే అవకాశం వచ్చినా   ఏ క్రికెటర్  కూడా ఆఅవకాశాన్ని  వదులుకోడు. కాని  ఇంగ్లాండ్ యువ ఆటగాడు  టామ్ బంటన్ మాత్రం  చెన్నై సూపర్ కింగ్స్ కంటే  ముంబై ఇండియన్స్  కు ప్రాతినిథ్యం  వహించడానికి ఇష్టపడతానని  అంటున్నాడు. 

దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటడం తో    టామ్ బంటన్  పై  కన్నేశాయి ఐపీఎల్  ఫ్రాంచైజీలు.  అందులోముఖ్యంగా  ముంబై , చెన్నై  జట్లు  ఈ పవర్ హిట్టర్ ను  దక్కించుకోవడానికి  ప్రయత్నాలు  చేస్తున్నాయి. డిసెంబర్ 19 న కోల్ కత్తా లో  ఐపీఎల్  వేలం జరగనుంది. దాంతో   బంటన్ ఈ ఆక్షన్ లోకి రానున్నాడు. ముంబై  ఇండియన్స్  ఇప్పటికే ఓపెనర్ ఏవిన్ లెవీస్  ను  విడుదల చేయడంతో   అతని స్థానం లో  బంటన్ ను  తీసుకోవాలని  భావిస్తుంది. 
 
ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో కూడా బంటన్, ముంబై ఇండియన్స్ కే జై కొట్టాడు.  చిన్నప్పటి  నుండి ముంబై ఇండియన్స్ జట్టు ఆటను చూస్తున్నాను. ఆ టీం  అంటే  నాకు చాలా  ఇష్టం ఆ జట్టు తో కలిసి ఆడాలని  ఉందని బంటన్ వెల్లడించాడు.  కాగా  బంటన్  ఐపీఎల్ వేలం లోకి రావడం  ఇదే  మొదటి సారి కానుంది.  మరి వేలం లో అతన్ని  ముంబై  ఇండియన్సే  సొంతం  చేసుకుంటుందో లేదో  చూడాలి.
 
ఇదిలావుంటే ఇటీవల  న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ ద్వారా  ఇంగ్లాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు టామ్ బంటన్. కానీ  ఈ సిరీస్ లో బంటన్ నిరాశపరిచాడు. అయితే ప్రస్తుతం అబుదాబీ లో జరుగుతున్న తో టీ 10లీగ్  లో మాత్రం  బంటన్ రెండు హాఫ్  సెంచరీ లతో అదరగొట్టాడు

మరింత సమాచారం తెలుసుకోండి: