కొంత కాలం పాటు ఆటనుంచి విరామం తీసుకోవాలని  వెస్టిండీస్‌ విధ్వంసక క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ భావించాడు. ఈ విషయాన్ని క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ విండీస్‌ క్రికెట్‌ బోర్డుకు  తెలియజేశాడు. దాంతో గేల్‌ వచ్చే నెలలో జరగనున్న భారత పర్యటనలో  ఆడే అవకాశం లేదు. ఈ టూర్‌లో భాగంగా భారత్‌–వెస్టిండీస్‌ మధ్య మూడు  టి20లు, 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి.

 

ఈ ఏడాది ఇకపై తాను ఏ టోర్నీలో కూడా  ఆడబోవడం లేదని అతను స్పష్టం చేశాడు. అంతే కాకుండా ఆ్రస్టేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లకు కూడా క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ దూరం కానున్నాడు. ప్రస్తుతానికి విరామం తీసుకోవడంపైనే తన ఆలోచనలు సాగుతున్నాయని క్రిస్‌ గేల్‌  చెప్పాడు.

 

క్రిస్‌ గేల్‌ మాట్లాడుతూ ....శరీరాన్ని ‘రీచార్జ్‌’ చేసుకొని వచ్చే సంవత్సరం కెరీర్‌ కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన గేల్‌... 2020 టి20 ప్రపంచ కప్‌లో ఆడటం పెద్ద  లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరారం తీసుకోవడానికి ముందు 40 ఏళ్ల గేల్‌ ఆదివారం తన చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నీలో పూర్తిగా విఫలమైన అతను 6 ఇన్నింగ్స్‌లలో కలిపి  కేవలం 101 పరుగులే చేశాడు.

 

దింతో గేల్‌ చాలా అసంతృప్తికి గురైయ్యాడు.  ఈ నేపథ్యంలో అతను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఫ్రాంచైజీ క్రికెట్‌లో నేను ఒకటి రెండు మ్యాచ్‌లలో విఫలమైతే ప్రతీ జట్టు నన్నూ భారంగా భావిస్తూ ఉంటుంది. నాకు తగిన గౌరవం దక్కదు. అప్పటి వరకు నేను జట్టుకు చేసిందంతా అందరూ మర్చిపోతారు,నేను బాగా ఆడిన ఆటలను కూడా మర్చిపోతారు . అయితే  నేను వీటికి అలవాటు పడటం నేర్చుకున్నాను’ అని గేల్‌ అన్నాడు. గేల్ విరామం వెనుక  పెద్ద విజయాన్ని చేధిస్తారని  కొంత మంది అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: