తన  జట్టు  చెన్నై సూపర్ కింగ్స్ కోసం  ఏ కెప్టెన్  తీసుకోని  నిర్ణయం తీసుకొని నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నాడు  భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని. ఐపీఎల్ లో  చెన్నై ను తిరుగులేని  టీంగా నిలబెట్టడంలో ధోని పాత్ర గురించి  ప్రత్యేకించి  చెప్పనక్కర్లేదు.  ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుండి  చెన్నైకే ప్రాతినిధ్యం  వహిస్తూ వస్తున్నాడు  ధోని. మధ్యలో  ఓ  రెండు  ఏళ్ళు  చెన్నై  టీం నిషేదానికి గురి కావడంతో వేరే జట్టుకు ఆడినా  ధోని..   చెన్నై మళ్ళీ  రీ ఎంట్రీ  ఇచ్చాక  ఆ జట్టుతోనే  తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఇప్పటివరకు  మూడు సార్లు చెన్నై ను ఛాంపియన్ గా   నిలబెట్టిన ధోని ఈసీజన్ లో తన  టీం ను  ఫైనల్ వరకు  తీసుకొచ్చాడు. 

 
ఇదిలా ఉంటే   చెన్నై టీం వచ్చే సీజన్ కోసం  ధోనిని  మళ్ళీ అంటిపెట్టుకొంది  అయితే  2021  లో జరిగే  ఆక్షన్ లో తనను టీం  నుండి విడుదలచేయాలని  ధోని, చెన్నై మేనేజ్మెంట్ ను కోరాడట.  ప్రస్తుతం   ధోని కోసం  చెన్నై యాజమాన్యం   భారీగా ఖర్చు పెడుతుంది. దాంతో ఆ డబ్బులతో  వేరే ఆటగాళ్లను కొనుక్కోండి  కానీ నామీద అంత ఖర్చు పెట్టకండి  ఒకవేళ  నన్ను మళ్ళీ తీసుకోవాలనుకుంటే  రైట్  టు  మ్యాచ్ కార్డు ద్వారా  తక్కువ ధరకు సొంతం చేసుకోండని   ధోని సూచించాడట.  అయితే  చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అందుకు  ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఒకవేళ  2021  ఐపీఎల్  తరువాత  ధోని క్రికెట్ నుండి   తప్పుకోవాలనుకున్న  తనను  మెంటర్ గా  కొనసాగించాలని మేనేజ్మెంట్  భావిస్తుంది కానీ ధోని ని  వదులుకోవడానికి మాత్రం ఇష్టం పడడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: