మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే ఎలా చెలరేగి ఆడతాడో అందరికి తెలుసు.  వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో తెలుసు.  గత కొంతకాలంగా ధోని క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.  కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  ధోని క్రికెట్ లో భారీ స్కోర్ చేయగల సమర్ధుడు.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, మునుపటిలా ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు.  వయసు పెరగడం ఒకటైతే మరొకటి ఫామ్ ను కోల్పోవడం.  
వరల్డ్ కప్ తరువాత ధోని మరలా మైదానంలోకి దిగలేదు.  మరో రెండేళ్లు ధోని క్రికెట్ ఆడబోతున్నట్టుగా తెలుస్తోంది.  2021 ఐపీఎల్ తరువాత ధోని రిటైర్ అవుతారని సమాచారం.  అయితే, ఐపీఎల్ కు మాత్రమే పరిమితం అవుతారా లేదంటే ఇండియా టీం లో తిరిగి ఆడతారా అన్నది చూడాలి.  ఇక ఇదిలా ఉంటె, ధోని నిన్నటి రోజున కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెట్ లోకి మరలా ఎప్పుడు వస్తున్నారు అనే విషయాన్ని జనవరి వరకు అడగొద్దని అన్నారు.. 
అలానే తన జీవితంలో రెండు విషయాలు మనసుకు చాలా దగ్గరయ్యాయని అందులో ఒకరు 2007 లో టి 20 ప్రపంచకప్ గెలుచుకోవడం కాగా, రెండోది 2011లో వరల్డ్ కప్ గెలుచుకోవడం.  ఈ రెండు సంఘటనలు మనసుకు చాలా దగ్గరయ్యాయని అన్నారు.  ఈ రెండు సంఘటనలు తన జీవితాన్ని క్రికెట్ కు చాలా దగ్గర చేశాయని చెప్పారు.  ఇదిలా ఉంటె, ధోని తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.  
బయట మైదానంలో కెప్టెన్ గా తాను ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఇంట్లో కెప్టెన్ మాత్రం సాక్షినే అని చెప్పారు.  ఆమె చెప్పినట్టుగానే ఇంట్లో వినాలని, తానే కాదు.. పెళ్ళైన ప్రతి మగాడు అలా చేయాల్సిందే అన్నారు.  పెళ్లి కానంతవరకే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది.  పెళ్లి తరువాత మన జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్పారు.  భార్యకు సంతోషంగా ఉంచడం కంటే మరొక ఆనందం ఉండదని ధోని చెప్పడం విశేషం.  ఎంతవారలైన భార్యాదాసులే. 

మరింత సమాచారం తెలుసుకోండి: