భారత క్రికెట్ కి ధోనీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. భారత క్రికెట్ కి టీ ట్వంటీ వరల్డ్ కప్ తో పాటు వన్డే ప్రపంచకప్ ను అందించిన సారధి ధోనీ. ఇరవై ఎనిమిదేళ్ళ తర్వాత భారత్ ప్రపంచకప్ ని ఒడిసి పట్టుకుందంటే కారణం ధోనీనే. ఒక సాధారణ ఆటగాడి స్థాయి నుండి కెప్టెన్ గా ఎదిగి భారత్ కి ఎన్నో విజయాలని అందించాడు. అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ మరియు టీ ట్వంటీల్లోనూ తనదైన కెప్టెన్సీతో భారత్ కి ఎన్నో చిరస్మరనీయ విజయాలను అందించాడు. 

 

అయితే ప్రస్తుతం ధోనీ రిటైర్ మెంట్ గురించి సర్వత్రా చర్చ నడుస్తుంది. గత కొన్ని రోజులుగ ధోనీ భారత క్రికెట్ కి ఆడటం లేదు. అలా అని రిటైర్ మెంట్ ప్రకటించనూ లేదు. ప్రస్తుతానికి ధోనీ క్రికెట్ నుండి కొద్దిరోజులు విరామం తీసుకుంటున్నాడు. అయితే తాజాగా మరోసారి ధోనీ రిటైర్ మెంట్ గురించి చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయమై ధోనీ ఇదివరకే సమాధానం ఇచ్చినప్పటికీ ప్రతీసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. 

 

అయితే తాజాగా ఈ విషయం గురించి మాట్లాడిన ధోనీ జనవరి వరకు తనై రిటైర్ మెంట్ గురించి అడగవద్దని కోరుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ, తనకి క్రికెట్ లో గుర్తుండిపోయే చాలా సంఘటనలు ఉన్నాయని, వాటిలో ఒక రెండు మాత్రం తననెప్పుడూ వెంటాడుతూ ఉంటాయని ఆ రెండు సంఘటనల గురించి చెప్పాడు. మొదటగా 2007 టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి, స్వదేశానికి తిరిగి వచ్చాక ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపు జరుగుతున్నప్పుడు రోడ్ల మీద వెళ్ళే అభిమానులు కార్లు ఆపి మరీ మమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషమేసిందని అన్నాడు. 

 

మరో సంఘటన గూర్చి చెబుతూ 2011 లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంకా ౨౦ పరుగులు కావాల్సినపుడు మైదానంలో ఉన్న అభిమానులు వందేమాతర నినాదం చేస్తూ ఉత్తేజపరచడం ఎప్పటికీ మరువలేనని అన్నాడు. ఈ రెండు సంఘటనలు నా మరణం వరకు గుర్తుంటాయని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: