బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ లో సంజూ సాంసన్ ని టీంలోకి తీసుకున్నప్పటికీ బెంచీకే పరిమితం చేశారు. టీమ్ లోకి తీసుకున్నప్పటికీ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ప్రతీ సారి పంత్ విఫలమవుతున్నా కూడా అతనికి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తూ సాంజూ సాంసన్ ని మాత్రం పక్కన పెట్టారు. అయితే ఈ విషయం పట్ల సర్వత్రా చర్చ జరిగింది. పంత్ స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకోవాలనే ఒత్తిడి ఎక్కువైంది.

 

అయినా కూడా భారత సెలెక్టర్ల బృందం ఈ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. అలా పట్టించుకోకుండానే వెస్టిండీస్ తో జరిగే టీ ట్వంటీ మ్యాచులకి కూడా సంజూని సెలెక్ట్ చేయలేదు. కానీ అనూహ్యంగా అతను ప్రస్తుతం జట్టులో ఉన్నాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ ఆడకపోవడంతో అతని స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకున్నారు. అయితే ఇక్కడే  ఆసక్తికరమైన విషయం ఒకటుంది. 

 

బేసిగ్గా సంజూ సాంసన్ వికెట్ కీపర్. వెస్టిండీస్ తో జరిగే మ్యాచుల్లో సంజూ సాంసన్ ని కీపింగ్ కి పంపుతారా లేదా ఫీల్డింగ్ పంపుతారా అనేది ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో సంజూ సాంసన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. సంజూ సాంసన్ మాట్లాడుతూ, నేను కీపింగు చేయగలను, ఫీల్డింగ్ కూడా చేయగలను, నా టీమ్ ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

 

ఈ మధ్య పంత్ ప్రదర్శన అస్సలు బాగాలేదు. అటు కీపింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ విఫలమవుతున్నాడు. ఇక ఫీల్డింగ్ అయితే పంత్ కి పెద్దగా అలవాటు లేని పని. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సంజూ సాంసన్ ని కీపింగ్ కి పంపుతారా లేదా ఫీల్డింగ్ కి పంపిస్తారో చూడాలి. శిఖర్ ధావన్ స్థానంలో సంజూని తీసుకుంటున్నారు కాబట్టి ఫీల్డింగ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: