భారత్ క్రికెట్ జట్టులో  ప్రస్తుతం స్థానాన్ని కాపాడుకోవడం క్రికెటర్లకు శక్తికి మించిన పని అవుతుంది. పోటీ ఎక్కువగా ఉండడం తో   ఓసిరీస్ లో  విఫలమైతే  మళ్ళీ జట్టులో  స్థానం దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి  నెలకొంది. టెస్టుల్లో  ఇప్పటికే  ఈ పరిస్థితిని    టీమిండియా  ఓపెనర్ శిఖర్ ధావన్ ఎదుర్కొంటున్నాడు.  ఇటీవల ధావన్  ను టెస్టులనుండి తప్పించి  అతని స్థానంలో  యువ ఆటగాళ్లకు  ఛాన్స్ఇస్తుంది సెలక్షన్ కమిటీ.  అందులో భాగంగా    టెస్టుల్లో  పృథ్వీ షా , మయాంక్ అగర్వాల్ , ధావన్ ప్లేస్ ను భర్తీ చేయడానికి  అర్హులు అని ఇప్పటికే  నిరూపించుకున్నారు.  మయాంక్ అయితే ఏకంగా  రెండు డబుల్ సెంచరీల తో  భవిష్యత్ ఆశాకిరణంగా మారిపోయాడు. దాంతో  ధావన్ టెస్టుల్లో కనిపించడం ఇక  అసాధ్యంలానే  కనిపిస్తుంది.  
 
 
ఇదిలావుంటే  పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రస్తుతం   ధావన్ స్థానానికి  వచ్చిన నష్టమేమి లేదు కానీ  భవిష్యత్తులో   ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ముగ్గురు యువ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. అందులో మొదటివాడు  పృథ్వీ షా. వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో టెస్టుల్లో అరంగేట్రం చేసి అదరగొట్టాడు  ఈ  ఓపెనర్. అయితే  ఆతరువాత గాయం కారణంగా  ఆసీస్ పర్యటనకు దూరం కాగా  ఇటీవల డోప్ టెస్ట్ లో పట్టుబడి  ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్నాడు.  అయితే  అతను కావాలని డోపింగ్ కు పాల్పడలేదు.  ఇక  ఈ యువ క్రికెటర్  పరిమిత ఓవర్ల  క్రికెట్ లో కూడా ఓపెనర్ స్థానం పై   కన్నేశాడు. డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ లా దూకుడుగా  ఆడడం  పృథ్వీ షా ప్రత్యేకత. దాంతో  శిఖర్ ధావన్ స్థానానికి పృథ్వీ షా  సరిగ్గా సరిపోతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 
 
 
ఇక  సూర్య కుమార్ యాదవ్ కూడా ఓపెనర్  స్థానం కోసం పోటీపడుతున్నారు.   ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ముంబై ఆటగాడు దాదాపు ప్రతి సీజన్ లో  అంచనాలకు  తగ్గట్లుగా రాణిస్తూనే వున్నాడు.  ఐపీఎల్ లో  మాత్రమే కాదు ఇతర దేశవాళీ  లీగుల్లో  కూడా తన ట్యాలెంట్ చూపిస్తూ   జాతీయ జట్టులో ఓపెనింగ్ స్థానం పై  కన్నేశాడు. వీరిద్దరి  తోపాటు మయాంక్ అగర్వాల్  కూడా ఓపెనింగ్ రేస్ లో కి వచ్చాడు.  ఇప్పటికే టెస్టుల్లో పర్మింనేట్ ఓపెనర్ గా సెటిల్ అయ్యేలా రాణిస్తున్న మయాంక్ పరిమిత ఓవర్ల క్రికెట్ లోకూడా  ఒక్క ఛాన్సు కోసం ఎదురుచూస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: