బంగ్లాదేశ్ తో టెస్టు ముగిసిన తర్వాత భారత్ వెస్టిండీస్ కి ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను సెలెక్ట్ చేసిన బృందం అందులో సంజూ సాంసన్ కి అవకాశం ఇవ్వలేదు. అయితే అనూహ్యంగా సాంసన్ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ తో జరిగే టీ ట్వంటీ మ్యాచులకి సంజూ సాంసన్ కూడా ఎంపిక కాబడ్డాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా వైదొలగడంతో అతని స్థానంలో సంజూ ని ఎంపిక చేసింది సెలెక్టర్ల బృందం. 

 

అయితే సంజూ సాంసన్ రాక జట్టులోని ఒక సభ్యుడికి హెచ్చరికలా పనిచేయనుంది. ఆ వ్యక్తి మరేవరో కాదు... రిషబ్ పంత్..గత కొన్ని రోజులుగా పంత్ మెరుగైన ప్రదర్శన ఇవ్వట్లేదు. అయినప్పటికీ జట్టులో చోటు సాధిస్తూనే ఉన్నాడు. అయితే ఇక నుండి అలా కుదరకపోవచ్చు. గతంలో పంత్ ప్రదర్శన బాగాలేకపోతే అతని స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకోవాలని ఒత్తిడి వచ్చిన విషయం తెలిసిందే. 

 

ఇప్పుడు సంజూ సాంసన్ జట్టులోకి రావడంతో పంత్ పై మరింత ఒత్తిడి పడనుంది. మునుపటి లాగా కాకుండా అతని ప్రదర్శన మెరుగు పరుచుకోకపోతే, ఆ స్థానాన్ని సంజూ సాంసన్ కి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సెలెక్టర్ల బృందం కూడా ఇప్పటికే పలుమార్లు వివరించింది కూడా. అయితే తాజాగా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా అదే మాట చెప్తున్నాడు. తన ప్రదర్శనని మెరుగు పరుచుకోకపోతే సంజూ సాంసన్ వచ్చేస్తాడని, ఇకనైనా బ్యాటింగ్ స్టైల్ ని మార్చుకోవాలని చెప్తున్నాడు.

 

మునుపటి కంటే అతనిపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రదర్శనలో తేడా ఉండకూడదని, లేదంటే మళ్లీ అవకాశం రావడం కష్టమవుతుందని తెలిపాడు. మరి దిగ్గజ ఆటగాళ్ల హెచ్చరికలను సీరియస్ గా తీసుకొని అతని ఆటతీరును మెరుగుపర్చుకుంటాడా లేదా అన్నది చూడాలి. అతని ఆట తీరు మెరుగు పడకపోతే తన స్థానాన్ని సంజూ సాంసన్ కి వదులుకోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: