ఇంగ్లాండ్ వన్డే , టీ 20 జట్టు  కెప్టెన్  ఇయాన్ మోర్గాన్  డిసెంబర్ లో జరుగునున్న ఐపీఎల్ ఆక్షన్  లో హాట్  ఫేవరేట్  గా బరిలోకి  దిగనున్నాడు.  గత కొంత కాలంగా   మోర్గాన్  సూపర్ ఫామ్ లో వున్నాడు. అంతేకాదు  తన సారథ్యంలో  ఇంగ్లాండ్  కు  మొదటి వన్డే  ప్రపంచ కప్ ను కూడా   అందించాడు.  ముఖ్యంగా  టీ 20 ల్లో భారీ హిట్టింగ్ తో  సత్తా చాటుతున్నాడు  మోర్గాన్.  దాంతో ఐపీఎల్ ప్రాంఛైజీలు  ఈ ఇంగ్లీష్  కెప్టెన్ ను ఎంతైనా  ఖర్చు పెట్టి  దక్కించుకోవ డానికి  రెడీ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా  మూడు జట్లు  మోర్గాన్ ను  సొంతం చేసుకోవడానికి  తహతహలాడుతున్నాయి.  ఆ జట్లేవో ఇప్పుడు చూద్దాం... 
 
కోల్ కత్తా  నైట్ రైడర్స్ : 
 
దినేష్ కార్తీక్  సారథ్యం లోని కేకేఆర్  బ్యాటింగ్  ఆర్డర్  చాలా బలంగా వుంది. అయితే  ఆక్షన్ కు  ముందు  ఆజట్టు..  ఓపెనర్  క్రిస్ లిన్ ను విడుదలచేసి  పొరపాటు చేసింది. అయితే  రైట్ టు  మ్యాచ్ ద్వారా కేకేఆర్ ,లిన్ ను మళ్ళీ సొంతం చేసుకొనే అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. మిడిల్ ఆర్డర్ లో నితీష్ రానా , దినేష్ కార్తీక్ , ఆండ్రీ రస్సెల్ లకు  తోడు  మోర్గాన్ కుడా తోడైతే   ఆ టీం కు  తిరుగుండదు. దాంతో  మోర్గాన్ ను దక్కించుకోవడానికి  కేకేఆర్ సన్నాహాలు చేస్తుంది. 
 
కింగ్స్ ఎలెవన్  పంజాబ్
 
ఈసీజన్ లో పంజాబ్  జట్టు  బ్యాటింగ్ లో  కేఎల్ రాహుల్ , క్రిస్ గేల్ లమీదనే ఎక్కువగా ఆధారపడింది. మిడిల్ ఆర్డర్ అయితే  దారుణంగా  నిరాశ పరించింది. ముఖ్యంగా   స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్   మిడిల్ ఆర్డర్  లో తీవ్రంగా నిరాశపరిచాడు.  దాంతో  మిల్లర్  ను విడుదలచేసింది పంజాబ్.  ఇక  మిల్లర్ స్థానంలో  మోర్గాన్ ను తీసుకుంటే  మిడిల్ ఆర్డర్ సమస్య  తీరిపోతుందని పంజాబ్ యోచిస్తోంది.  దాంతో మోర్గాన్ కోసం  ఈ జట్టు  ఎంతైనా ఖర్చు పెట్టేలా కనిపిస్తుంది. 
 
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు :
 
జట్టు నిండా  స్టార్ ఆటగాళ్లే వున్నా ఇంత వరకు  ఒక్కసారి  కూడా ఛాంపియన్ గా అవతరించలేకపోయింది ఆర్సీబీ.  ఈసీజన్ లో నైతే ఆ జట్టు దారుణంగా నిరాశపరించింది. బ్యాటింగ్ లో  కోహ్లీ , డివిలియర్స్  పైనే ఎక్కువగా  ఆధారపడుతుండడం తో  మిడిల్ ఆర్డర్ లో మోర్గాన్ లాంటి  ఆటగాడు ఉంటే  చాలా ఉపయోగరకంగా ఉంటుందని  బెంగుళూరు యోచిస్తోంది. దాంతో ఆ జట్టు మోర్గాన్ పై  కన్నేసింది.   
 
మరి  ఈమూడు  జట్లలో  ఏ జట్టు  మోర్గాన్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే డిసెంబర్  19వరకు  వేచిచూడాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: