శంషాబాద్ లో జరిగిన  పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిని  దారుణంగా  రేప్ చేసి  సజీవ దహనం చేసిన ఘటన  ప్రస్తుతం  రాష్ట్రం తోపాటు  దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టిస్తుంది.  ఇప్పటికే  ఈ ఘటన పై సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖులు  స్పందించగా  తాజాగా  టీమిండియా  కెప్టెన్  విరాట్ కోహ్లి  కూడా ప్రియాంక హత్యను  ఖడించాడు. 
 
 
 
హైదరాబాద్ లో  జరిగిన ఘటన సిగ్గుచేటు. సమాజంలో మనం బాధ్యత తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా  చూడాల్సిన  సమయం ఆసన్నమైందని కోహ్లి  ట్వీట్   చేశాడు. ఇక ప్రియాంక రెడ్డి హత్య కేసును  24గంటల్లోనే ఛేదించిన పోలీసులు నలుగురు  నిందితులు అరెస్టు చేశారు.  ఆ తరువాత  వీరిని  14రోజుల రిమాండ్ నిమిత్తం  చర్లపల్లి జైలుకు  తరలించారు. మరోవైపు  ప్రజా సంఘాలు , విద్యార్థులు...  ప్రియాంక రెడ్డి  హత్యాచార  నిందితులను  నడిరోడ్డుపై  ఉరి తీయాలని  డిమాండ్ చేస్తూ  ఆందోళనకు దిగారు.  ఉద్రిక్త పరిస్థుల నడుమే  నలుగురు  నిందితులను ,పోలీసులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి  చర్లపల్లి జైలుకు  తరలించారు. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: