సమకాలిన క్రికెట్ లో దిగ్గజాల రికార్డులు బద్దలవుతున్న టెస్టుల్లో  అత్యధిక  వ్యక్తిగత  పరుగులు చేసిన  రికార్డు ను   మాత్రం  ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. వెస్టిండీస్  క్రికెట్ దిగ్గజం  బ్రియాన్ లారా  400నాటౌట్  తో టెస్టుల్లో  అత్యధిక స్కోర్  చేసిన  ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2004 లో ఇంగ్లాండ్ పై లారా ఈ ప్రపంచరికార్డు ను సాధించాడు.  ఈ రికార్డు నెలకొల్పి  15ఏళ్ళకు పైగా అవుతున్న ఇంకా చెక్కు చెదరలేదు. అయితే తాజాగా  ఆస్ట్రేలియా  స్టార్ ఓపెనర్  డేవిడ్ వార్నర్  ఈ రికార్డు  ను బద్దలు కొట్టేలానే  కనిపించాడు. 
 
 
 
అడిలైడ్ వేదికగా   ప్రస్తుతం ఆస్ట్రేలియా -పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్టులో ఆసీస్  మొదట బ్యాటింగ్ కు దిగగా  వార్నర్  ఏకంగా ట్రిపుల్ సెంచరీ తో అదరగొట్టాడు. అతని జోరు చూస్తే 400 చేయడం ఖాయమనిపించింది. అయితే వార్నర్ 335 పరుగుల వద్ద వున్నపుడు ఆసీస్ కెప్టెన్  టీమ్ పైన్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దాంతో  వార్నర్,లారా రికార్డు ను బ్రేక్ చేయలేకపోయాడు. ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం  మీడియాతో మాట్లాడాడు వార్నర్.  లారా రికార్డు గురించి ఆలోచించలేదని  సరిపడా రన్స్ ఉండడం తో పైన్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు దీనిలో నాకు ఎలాంటి అసంతృప్తిలేదు.  ఇక ప్రస్తుతం వున్నక్రికెటర్ల లో  టెస్టుల్లో లారా  రికార్డు ను  బ్రేక్ చేయడం ఒక్క  భారత  క్రికెటర్ రోహిత్ శర్మ వల్లనే అవుతుందని  వార్నర్ అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: