క్రికెట్ లో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించడం ఏ జట్టు అయినా ఎంతో పెద్ద ఘనతగా తీసుకుంటుంది. సొంత దేశంలో ఆస్ట్రేలియా కి అంత ఘనమైన రికార్డు ఉంది. గత సంవత్సరంలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా  సిరీస్ మనము గెలిచాము. కానీ ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు అయినా వార్నర్, స్మిత్ లేరు అని ఆ విజయం అంతగా నచ్చలేదు అని కొందరు పండితులు పెదవి విరిచారు. ఒక సంవత్సరం నిషేధం తర్వాత తిరిగి వచ్చిన స్మిత్, వార్నర్ ఇంగ్లాండ్లో జరిగినవరల్డ్ కప్ ,యాషెస్  సిరీస్లో ఇద్దరు దుమ్ములేపారు.

 

ఇప్పుడు పాకిస్థాన్ తో సిరీస్లో వార్నర్ బీభత్సమైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్‌ క్రికెట్‌ జట్టు ఉన్న పరిస్థితుల్లో వారిని ఏ జట్టుకైనా ఓడించడం అంత ఈజీ కాదన్నాడు. అందులోనూ ఆసీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించడమంటే అది మరింత కష్టమన్నాడు. కాకపోతే ప్రపంచ క్రికెట్‌లో ఉన్న ప్రస్తుత జట్లలో ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడించే సత్తా టీమిండియాకే ఉంది అని చెప్పాడు .

 

ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో టీమిండియా ప్రదర్శనను ప్రస్తావించాడు. ‘ కేవలం ఆసీస్‌ను వారి దేశంలో ఓడించాలంటే టీమిండియాకే సాధ్యం అవుతుంది. ఆసీస్‌కు ధీటైన సవాల్‌ విసిరే జట్టు భారత్‌ ఒక్కటే. ప్రస్తుతం టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. ఆసీస్‌కు గట్టిపోటీ ఇచ్చే జట్టు కచ్చితంగా టీమిండియా ఒక్కటే’ అని వాన్‌ పేర్కొన్నాడు.

 

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో టెస్టులో భాగంగా పాక్‌కు కూల్చేసిన ఆసీస్‌ మరో ఇన్నింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ 48 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. తొలి టెస్టులో సైతం ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: