వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న  కోల్ కత్తా లో ఐపీఎల్  వేలం  జరుగనుంది. ఎనిమిది  జట్లలో మొత్తం  73 బెర్తుల కోసం  నిర్వాహకులు ఈ వేలంను  నిర్వహించనున్నారు.  నవంబర్ 30 తో ఈ వేలం లో పాల్గొనే ప్లేయర్ల  నమోదు ప్రక్రియ ముగిసింది.  రికార్డు స్థాయిలో  ఈ వేలంలో  971మంది  ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఇందులో 713 మంది భారత ప్లేయర్లు ఉండగా 215మంది విదేశీ ప్లేయర్లు వున్నారు. 
 
 
ఇక  ఈ వేలం నుండి ఇద్దరు స్టార్ క్రికెటర్లు  తప్పుకున్నారు.  అందులో మొదటి వాడు ఆస్ట్రేలియా స్టార్  పేసర్ మిచెల్ స్టార్క్. ప్రపంచ కప్ , యాషెస్ సిరీస్ ను ద్రుష్టి లో పెట్టుకొని గత సీజన్ వేలానికి కూడా దూరంగా వున్న స్టార్క్ ఈసారి కూడా  ఈ ఆక్షన్ నుండి తప్పుకున్నాడు.  ఒక వేళా  స్టార్క్ గనుక  వేలంలో అందుబాటులో ఉండి ఉంటే ప్రాంచైజీలూ కోట్లు కుమ్మరించి అతన్ని  సొంతం చేసుకునేవి. ఇక  స్టార్క్ తోపాటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్  జో రూట్ కూడా  ఈ వేలం నుండి తప్పుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: