ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కేవలం డ్రాతో సరిపెట్టుకోవడంతో సిరీస్‌ను కోల్పోయింది. అదే సమయంలో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన  సిరీస్‌ను 1-0తో న్యూజిలాండ్‌ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌   రెండో టెస్టును గెలిస్తేనే సిరీస్‌ను  కాపాడుకునే పరిస్థితుల్లో  ఫీల్డింగ్‌ పొరపాట్లు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి.  న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రధాన ఆటగాడైన కేన్‌ విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ ఫీల్డర్‌ జో డెన్లీ వదిలేసిన తీరు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. విలియమ్సన్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో  ఒక షాట్‌ను మిడ్‌ వికెట్‌ మీదుగా ఆడగా అది క్యాచ్‌గా లేచి నేరుగా వెళ్లి ఫీల్డర్‌ డెన్లీ చేతుల్లో పడింది.

 

అయితే డెన్లీ  దాన్ని వదిలేశాడు. విలియమ్సన్‌ అది చాలా సునాయాసమైన క్యాచ్‌ కావడంతో  ఔటయ్యాడనే అనుకుంటున్నారు . కానీ  ఆ క్యాచ్‌ను డెన్లీ నేలపాలు చేశాడు. డెన్లీ తక్కువ ఎత్తులో సమానమైన వేగంతో వచ్చిన బంతి క్యాచ్‌ రూపంలో వస్తే  వదిలేయడంతో ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా తలలు పట్టుకున్నారు.

 

స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒకవైపు బౌలర్‌ ఆర్చర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంటుంటే.. ఆ క్యాచ్‌ను వదిలేయడం చూసిన పెద్ద షాకయ్యాడు.  అప్పటికి విలియమ్సన్‌ 62 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత విలియమ్సన్‌కు మరొక లైఫ్‌ లభించింది. సామ్‌ కర్నాన్‌ విలియమ్సన్‌ను రనౌట్‌ చేసే అవకాశాన్ని జార విడిచాడు. ఇలా విలియమ్సన్‌   రెండు లైఫ్‌లు సెంచరీ పూర్తి చేసుకున్నాడు . కాకపోతే అటు తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ రద్దు చేయక తప్పలేదు.

 

సోషల్‌ మీడియలో డెన్లీ క్యాచ్‌ డ్రాపింగ్‌పై జోకులు పేలుతున్నాయి.  డెన్లీ.. మరో మైక్‌ గాటింగ్‌లా ఉన్నాడంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.  1993లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కిరణ్‌ మోరే వికెట్లు ముందు ఇచ్చిన చాలా సింపుల్‌ క్యాచ్‌ను గాటింగ్‌ ఇలానే వదిలేయడాన్ని ఉదహరిస్తున్నారు. ఇది టెస్టు చరిత్రలోనే చెత్త ఫీల్డింగ్‌ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: