ప్రియమ్ గార్గ్ ప్రస్తుతం  ఇప్పుడిప్పుడే  ఈ పేరు క్రికెట్ అభిమానులకు  పరిచయం అవుతుంది.  దానికి కారణం  వచ్చే ఏడాది  జనవరి -ఫిబ్రవరి లో సౌతాఫ్రికా  లో జరుగనున్న అండర్ 19ప్రపంచ కప్ కోసం  బీసీసీఐ  సోమవారం  భారత జట్టును ఎంపిక చేయగా ఆ టీం కు  ఉత్తర ప్రదేశ్ కు చెందిన 19ఏళ్ళ  ప్రియమ్ గార్గ్  ను కెప్టెన్ గా నియమించింది. దాంతో గత రెండు రోజుల నుండి ప్రియమ్ వార్తల్లో నిలుస్తున్నాడు. 
 
ఈ సందర్భంగా  నేషనల్ మీడియా తో  మాట్లాడిన  ప్రియమ్...  ఆసక్తికర  విషయాలు వెల్లడించాడు.  నేను  టీమిండియా కు కెప్టెన్  అయ్యానంటే  ఆ క్రెడిట్  అంత మా నాన్నకే  దక్కుతుంది.  నాకోసం  ఆయన చాలా త్యాగం చేశారు.  మా నాన్న నరేష్  గార్గ్  నన్ను  క్రికెటర్ ను చేయడానికి పాల ప్యాకెట్లు అమ్ముతూ , స్కూల్  వ్యాన్ నడుపుతూ  చాలా కష్టపడ్డారు.  ఆరు ఏళ్ళ వయసులోనే  బ్యాట్ పట్టాను. క్రికెట్ కిట్ కోనాడనికి కూడా  మా దగ్గర డబ్బులు లేవు  అయితే మా నాన్న తన స్నేహితుల  దగ్గర  అప్పు చేసి నాకు క్రికెట్ కిట్ కొనిచ్చారు. 
 
నాకు  ఒక అన్న ముగ్గురు  చెల్లెళ్లు . ఫ్యామిలీ  గడవడం  చాలా కష్టంగా ఉండేది.  అయినా కూడా  నన్ను క్రికెటర్ ను చేయడానికి  మా నాన్న  అహర్నిశలు కష్టపడ్డారు. నేను  ఇప్పుడు ఇక్కడి దాక  వచ్చానంటే అది మా నాన్న వలనే.  నా 11వ ఏటనే మా అమ్మ చనిపోయింది.  మా అమ్మ కూడా నేను గొప్ప క్రికెటర్ ను కావాలని కలలు కనేది. కాని  ఇప్పుడు ఆ  కల నెరవేరేసమయానికి  ఆమె లేదు అదొక్కటే బాధ అని  ప్రియమ్ పేర్కొన్నాడు. ఇక ఉత్తర ప్రదేశ్...   టీమిండియా కు  కైఫ్ , ప్రవీణ్ కుమార్ ,సురేష్ రైనా , ఆర్పి సింగ్ వంటి  ఎందరో గొప్ప ప్లేయర్లను  అందించింది.  ప్రస్తుతం టీమిండియా  కు ఆడుతున్న  కుల్దీప్ యాదవ్  కూడా  ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చిన వాడే మరి వీరిలాగే ప్రియమ్ గార్గ్ కూడా   భవిష్యత్తులో టీమిండియా తరపున  రాణించాలని  ఆశిద్దాం.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: