భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని షాట్స్ కి మరియు ఆయన బ్యాటింగ్ శైలికి మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు అనే చెప్పాలి. ఇక ధోని బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి దిగితే అతడు కొట్టే హెలికాఫ్టర్ షాట్స్ కు ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఇటీవల జరిగిన వన్ డే వరల్డ్ కప్ తరువాత ధోని ఇండియా జట్టుకి చాలావరకు దూరం అవ్వగా, అతడి స్థానంలో యువ కీపరైన రిషబ్ పంత్ ను తీసుకోవడం జరిగింది. అయితే రిషబ్ మాత్రం ఓవర్ ఆల్ గా ఇప్పటివరకు పర్వాలేదనిపించేలా మాత్రమే పెర్ఫర్మ్ చేయడంతో అతడిపై కొంతవరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

ఇక నేడు బెంగాల్ టైగర్ దాదా గా పేరుగాంచిన సౌరవ్ గంగూలీ రిషబ్ ని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేటి నుండి ప్రారంభం కాబోతున్న వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా రిషబ్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు, ఈ సిరీస్ లో కనుక అతడు సరిగ్గా రాణించకపోతే అతడి కెరీర్ కొంత ప్రశ్నార్ధకంలో పడుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయమై రిషబ్ ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకింత వెనకేసుకురావడంతో పాటు అతడిని ధోనితో పోల్చాడు. అయితే ఈ విషయమై దాదా మధ్యలో కలుగ చేసుకుని మాట్లాడారు. 

 

ఆయన మాట్లాడుతూ, రిషబ్ మంచి ఆటగాడే అయినప్పటికీ, అతడికి ధోనికి ఉన్నంత సత్తా రావాలంటే మరొక పదిహేనేళ్లకు పైగా పడుతుందని అన్నారు. ఎందుకంటే ధోని ఓవర్ నైట్ లోనే స్టార్ ఆటగాడిగా ఎదగలేదని, దాదాపుగా 15 ఏళ్లకు పైగా శ్రమిస్తేనే గాని అతడికి అంతటి గొప్ప పేరు రాలేదని, కాబట్టి రాబోయే రోజుల్లో రిషబ్ తన ఆటపై గట్టిగా దృష్టి పెట్టి ముందుకు సాగితే అతడికి మంచి భవిష్యత్తు లభించే అవకాశం ఉంటుందని దాదా అన్నారు. అయితే దాదా వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: