ఐసీసీ  టెస్టు, వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో  నెంబర్ 1 గా  కొనసాగుతున్న  టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లి..  టీ 20ల్లో మాత్రం టాప్10 లో చోటు దక్కించుకోలేకపోయాడు.  అలాగే  వన్డేలు,టెస్టుల్లో  సెంచరీల మీద సెంచరీలు బాది రికార్డులు సృష్టించిన  కోహ్లి.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం  ఇంతవరకు  ఒక్క శతకం కూడా బాధలేకపోయాడు. ఇలా పొట్టి ఫార్మాట్ లో కొన్ని రికార్డులు కోహ్లికి అందని ద్రాక్షలాగే వున్నాయి. అయితే  కోహ్లి  శ్రద్ద పడితే  ఈ రికార్డులు  అతనికోలెక్కకాదు. 
 
 
ఇదిలావుంటే  నిన్న  ఉప్పల్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి ఓ రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ లో  94పరుగులతో వీరవిహారం చేసి జట్టును గెలిపించిన కోహ్లిని మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. టీ 20ల్లో ఈ  అవార్డు కోహ్లికి ఇది 12వ సారి.  తద్వారా టీ 20ల్లో  అత్యధిక  మ్యాన్ అఫ్ ది మ్యాచ్  అవార్డులు  గెలుచుకొని కోహ్లి, అఫ్ఘానిస్తాన్  ఆల్ రౌండర్ మహమ్మద్ నబి తో కలిసి ఈ జాబితాలో  మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు. నబి కూడా  ఇప్పటివరకు 12మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లు అవార్డులు గెలుచుకున్నాడు. ఇక  పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది 11మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లు గెలుచుకొని తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: