పాకిస్థాన్  క్రికెటర్ ఫవాద్ ఆలమ్  ఎట్టకేలకు మళ్ళీ జాతీయ జట్టు లో స్థానం సంపాదించుకున్నాడు. శ్రీలంక తో జరుగనున్న  రెండు టెస్టుల సిరీస్ కు  ఫవాద్ ఆలమ్ కు జట్టులో చోటు కలిపించింది పీసీబీ. ఇటీవల దేశవాళీ  క్రికెట్ లో  పరుగుల వరద పారించడం తో  ఆలమ్ ను ఎంపిక చేశామని  పాకిస్థాన్ క్రికెట్  బోర్డు  చీఫ్ సెలక్టర్ , జట్టు ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు.  
 
 
 34 ఏళ్ల  ఆలమ్ చివరి సారి 2009 లో డ్యునెడిన్ లో  న్యూజిలాండ్ పై  ఆడాడు. మళ్ళీ 10 సంవత్సరాల తరువాత  తాజాగా అతను  టెస్టు జట్టుకు  ఎంపికైయ్యాడు.  ఇప్పటివరకు  ఫస్ట్ క్లాస్  క్రికెట్ లో  ఆలమ్ 58సగటుతో  12,222 పరుగులు సాధించడం విశేషం.   ఇక  ఫవాద్ ఆలమ్ తోపాటు  ఉస్మాన్ షిన్వారి కూడా  శ్రీలంక తో టెస్టు సిరీస్ కు ఎంపికైయ్యాడు. అతనికిదే  తొలి అంతర్జాతీయ టెస్టు సిరీస్.  కాగా  పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య  మొదటి టెస్టు  బుధవారం నుండి  రావల్పిండి లో జరుగనుండగా  రెండో టెస్టు ఈనెల 19నుండి  కరాచీ లో జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: