హైదరాబాద్ వేదికగా హిట్ కొట్టిన భారత జట్టు ఒక్క రోజు విరామంతో రెండో మ్యాచ్‌కు రెడీ అయింది. తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి సన్నిధిలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా ఆదివారం వెస్టిండీస్‌తో తలపడనుంది. మొదటి మ్యాచ్‌లో భారీ టార్గెట్ ఛేదించి మంచి జోరుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలని గెట్టి పోటీ ఇస్తుంటే భారత్ జోరుకు అడ్డుకట్ట వేయాలని విండీస్ ఆలోచిస్తుంది.

                                                                              

హైదరాబాద్‌లో మొన్న ఆడిన మ్యాచ్ ఎంత హైలెట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. కోహ్లీ రివెంజ్ తీర్చుకుంటే ఇలాగె ఉంటది అన్నట్టు గెలిచి చూపించాడు. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలయ్యామని వెస్టిండీస్ విశ్లేషించుకుంటుంటే.. ప్రత్యర్థి గొప్పగా పోరాడకున్నా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే కరీబియన్లు భారీ స్కోరు చేశారని టీమ్‌ ఇండియా నిర్ధారించుకుంది.

                                                

ఇప్పటికే విండీస్‌పై వరుసగా ఏడు టీ20ల్లో నెగ్గిన కోహ్లీ అండ్ కో.. ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకోవడంతో పాటు 2-0తో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తుంది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహలు మొదలుపెట్టింది టీమ్‌ఇండియా. అయితే ఇక్కడే సిరీస్ కైవసమైతే.. ముంబై వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకోవచ్చని చూస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: