హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరిగిన విషయం  తెలిసిందే. ఈ మ్యాచ్ భారత్ విజయ ఢంకా మోగించింది. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగాఅ చేధించి తన సత్తాని చూపించింది కోహ్లీ జట్టు. అయితే ఈ మ్యాచ్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చొటు చేసుకున్నాయి. సాధారణంగా క్రికెట్ లో ఇలాంటి సంఘటనలు అప్పుడపుడు చోటు చేసుకుంటూ ఉంటాయి.

 

క్రికెట్ లో ఒకరినొకరు కవ్వించుకోవడమ్ చూస్తూనే ఉంటాం. అవతలి వ్యక్తిపై ఎమోషనల్ గా చురకలు అంటిస్తే ఆటపై శ్రద్ధ పోతుందన్న ఉద్దేశ్యంతో అప్పుడపుడు ఆటగాళ్ళు ఇలాంటి చర్యలు చేస్తుంటారు. అలాంటి చర్యలు జరిగినపుడు ప్రత్యర్థి ఆటగాడు అదే టెంపర్ ఉన్న గలవాడైతే దానికి రిటార్టు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలా రిటార్టు ఇవ్వడంలో కోహ్లీ దిట్ట. అతడి కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అతడిలో అదే టెంపర్ కనబడుతుంది.

 

30 ప్లస్‌లోకి వచ్చినా కూడా అతడిలో ఉత్సాహం, ఆవేశం ఎంతమాత్రం చల్లారలేదు. మైదానంలో దూకుడుకు మారుపేరుగా కనిపించే కోహ్లి.. తనను నడిపించేది ఆవేశమే అని భావిస్తాడు. వికెట్ పడితే అతను సంబరాలు చేసుకునే తీరు.. ఒక షాట్ కొట్టినా, సెంచరీ బాదినా ఎగ్జైట్ అయ్యే తీరు వేరుగా ఉంటుంది. ఇక కోహ్లిని అవతలి జట్టులోని బౌలర్లు కవ్వించారా అంతే సంగతి. అతడిలో కసి రెట్టింపవుతుంది. ఇక అతణ్ని ఆపడం కష్టమవుతుంది.

 


వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ తన బౌలింగ్ లో వికెట్లు పడ్డప్పుడు జేబులోంచి బుక్ తీసినట్టు తీసి టిక్ మార్క్ చేస్తూ కవ్వించాడు. ఇది మనసులో ఉంచుకున్న కోహ్లీ విలియమ్స్ బౌలింగ్ ని ఉతికి ఆరేశాడు. సిక్సర్ల సిక్సర్లు కొడుతూ అతడి బౌలింగ్ పై దాడి చేశాడు. వరుస సిక్సర్లు కొట్టాక కోహ్లీ తన జేబులోంచి బుక్ తీసి సిక్సర్లు కొట్టినట్టు టిక్ మార్క్ చేస్తూ విలియమ్స్ కి రిటార్ట్ ఇచ్చాడు. ఇది చూశాక కోహ్లిని ఇంకోసారి కవ్వించడానికి ఏ బౌలర్ అయినా భయపడతాడనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: