హైదరబాది వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ అధ్భుత విజయం సాధించింది. సాధారణంగా ఉప్పల్ మైదానం బౌలర్లకి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సారి బ్యాట్స్ మెన్ తమ అద్భుత ప్రదర్శనతో స్కోరును రెండు వందల వరకు తిసుకెళ్ళారు. అంత పెద్ద భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లీ సేన కొంచెం తడబడ్డప్పటికీ ఎట్టకేలకు విజయకేతనాన్ని ఎగరవేసి తమకి ఎదురు లేదని సగర్వంగా చెప్పింది.

 

అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 50 బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో 94 పరుగులు చేసి భారత్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు.  అయితే ఈ మ్యాచ్ బౌలర్ల ప్రదర్శన అంత చెప్పుకోదగ్గదిగా లేదు. ఒక్క భువనేశ్వర్ కుమార్ తప్ప మిగిలిన వారందరూ విపరీతంగా పరుగులు ఇచ్చినవారే.  అయితే భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. చాహల్ ఈ మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతని సాధించాడు.  ఈ పొట్టి ఫార్మట్‌లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు(52) తీసిన ఆటగాడిగా రవిచంద్రన్‌ అశ్విన్‌ సరసన చేరాడు. 

 

 

విండీస్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ వికెట్‌ సాధించడంతో ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రిత్‌ బుమ్రా(51 వికెట్లు) రికార్డును అధిగమించాడు. ఇక ఇప్పటికే టీమిండియా తరుపున అతి తక్కువ మ్యాచ్‌ల్లో(34) 50 వికెట్లు అందుకున్న ఆటగాడిగా చహల్‌ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో శ్రీలంక స్పి​న్నర్‌ అజంత మెండీస్‌(26) ఆగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో 32 మంది బౌలర్లు 50కి పైగా వికెట్లు సాధించారు. 

 

 

ఈ జాబితాలో టీమిండియా తరుపున అశ్విన్‌, బుమ్రా, చహల్‌లు ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హెట్‌మైర్‌తో పాటు పొలార్డ్‌ వికెట్‌కు కూడా చహల్‌ పడగొట్టాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: