విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భార‌త్ ఇన్సింగ్స్ ముగిసింది. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచిన విండీస్ భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భార‌త్ ఓపెనర్లు రోహిత్ శ‌ర్మ‌, లోకేష్ రాహుల్ ఇద్ద‌రూ తీవ్రంగా నిరాశ ప‌రిచారు. రోహిత్ శ‌ర్మ 15, రాహుల్ 11 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. ఇక వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శివ‌మ్ దూబే చెల‌రేగి ఆడాడు. సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. టీ20ల్లో దూబేకు ఇదే తొలి అర్ధ సెంచరీ. 

 

మరోవైపు కెప్టెన్ కోహ్లీ నిదానంగా ఆడుతూ దూబేకు అవకాశం ఇచ్చాడు. కాగా, దూకుడుమీదున్న దూబే 11వ ఓవర్ మూడో బంతికి అవుటయ్యాడు. హెడెన్ వాల్ష్ బౌలింగ్‌లో హెట్మియెర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న దూబే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ 19 ప‌రుగుల చేసి అవుట్ అయ్యాడు. ఇక బౌలర్ హేడెన్ వాల్ష్ వేసిన 17వ ఓవర్ రెండో బంతి ఆడిన శ్రేయాస్ అయ్యర్ బ్రాండన్ కింగ్‌కు క్యాచ్‌గా చిక్కడంతో ఔట్ అయ్యాడు. శ్రేయాస్ 11 బంతుల్లో 10 పరుగులు చేశాడు. 

 

ఇక చివ‌ర్లో ఐదో వికెట్ ప‌డ్డాక విండీస్ బౌల‌ర్లు ఎక్క‌డిక‌క్క‌డ చాలా క‌ట్టుదిట్టంగా బంతులు వేశారు. ఆరో వికెట్‌గా ర‌వీంద్ర జ‌డేజా 9 ప‌రుగ‌లు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివ‌రి ఓవ‌ర్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ డ‌క్ అవుట్ అయ్యి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. దూబే చెల‌రేగుతున్న‌ప్పుడు 200 ప‌రుగుల అల‌వోక‌గా వెళుతుంద‌నుకున్న స్కోరు చివ‌ర్లో భార‌త్ బ్యాట్స్‌మెన్స్ ప‌రుగులు రాబ‌ట్ట లేక‌పోవంతో భార‌త్ 170 ప‌రుగుల‌తో స‌రిపెట్టుకుంది. విండీస్ బౌల‌ర్ల‌లో హెడెన్ వాల్ష్ రెండు వికెట్లు, కార్టెల్ రెండు, పెరీ, విలియ‌మ్స్ త‌లా ఒక వికెట్ తీశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: