హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. టీమిండియా బ్యాట్ మేన్స్  మెరుపు ఇన్నింగ్స్ ఆడి అలవోకగా భారీ స్కోరును ఛేదించి  విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా  నేడు తిరువనంతపురం వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అయితే అటు టీమిండియాకు మాత్రం మ్యాచ్ ని  గెలిచే అవకాశాలు తగ్గుతున్నట్లు   కనిపిస్తుంది. రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్  ఎంచుకుంది. 

 


 అయితే తొలుత బ్యాటింగ్కు దిగింది టీమిండియా. కాగా  టీం ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 11 పరుగులకే అవుట్ అయ్యి  వెనుతిరిగాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కాస్త కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ 15 పరుగులకే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే  తనదైన స్టైల్ సిక్స్ లతో  ఫోర్ లతో  హోరెత్తించారు. 30 బంతుల్లో ఏకంగా 54 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత 97 పరుగుల వద్ద శివం దూబే  కూడా మూడోవికెట్ రూపంలో అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ భారత్ మొత్తం ఆ తర్వాత వచ్చిన కోహ్లీ పై పడింది. అయితే కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ కోర్ దిశగా తీసుకెళ్తాడు అని అభిమానులు భావించారు. కానీ కోహ్లీ సైతం 12 పరుగులకే వెనుదిరిగాడు. 

 


 కాగా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ను కైవసం చేసుకోవాలన్న టీమిండియా పట్టుదలతో ఉండగా... అటు వెస్టిండీస్  కూడా ఈ మ్యాచ్ గెలిచి ఒకటి ఒకటి తో  సమం చేసింది సిరీస్ పై  ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది .కాగా  టీమిండియా తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజు సాంసన్  కు మరోసారి నిరాశే ఎదురైంది. కాగా  వెస్టిండీస్ బౌలర్లు వికెట్ల వేటలో విజయం సాధిస్తూ  దూసుకుపోతున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్స్  అందరినీ పెవిలియన్ పంపించేశారు వెస్టిండీస్ బౌలర్లు. దీంతో ఈ మ్యాచ్లో విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ కోసం ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు వెస్టిండీస్ కి అవకాశాలు మెరుగు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: