మూడు t20 మ్యాచ్‌లో సీరిస్‌లో భాగంగా తిరుప‌నంత‌పురంలో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా వెస్టిండిస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భార‌త్ ఓడింది అనేకంటే చెత్త బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగే భార‌త్‌ను ఓడించింది. భ‌వ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌లో ఓపెనర్లు వ‌రుస బంతుల్లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ల‌ను వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రిషిబ్ పంత్ నేల‌పాలు చేశారు. దీంతో వీరిద్ద‌రు రెచ్చిపోయారు. అస‌లు మ‌న వాళ్లు బంతులు ఎక్క‌వ వేయాలో అర్థం కాక గంద‌ర‌గోళానికి గుర‌వ్వ‌డంతో వెండీస్ బ్యాట్స్‌మెన్స్ మ‌న‌వాళ్ల‌ను ఓ ఆటాడుకున్నారు. మ‌న‌వాళ్ల‌ను ఆడుకుంటూ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.

 

171 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేప‌ట్టిన విండీస్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. 10 ఓవ‌ర్ల‌లో వీరిద్ద‌రు 73 ప‌రుగులు చేశారు. ఎవీన్ ల‌యూస్ 40 ప‌రుగులు చేసి వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వ‌న్ డౌన్‌లో వ‌చ్చిన హెట్‌మెయిర్ సైతం 14 బంతుల్లోనే 3 సిక్స‌ర్ల‌తో స్పీడ్‌గా 23 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఓపెన‌ర్ లెండీ సిమ్మ‌న్స్ 67 ప‌రుగుల‌తోనూ, నికోల‌స్ పూరాన్ 38 ప‌రుగుల‌తోనూ అజేయంగా నిలిచి మ్యాచ్ గెలుచుకున్నారు. భార‌త్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ర‌వీంద్ర జ‌డేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెల‌వ‌డంతో సీరిస్ 1-1తో స‌మానం అయ్యింది. 

 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ పరుగులకే ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. 15 పరుగులు, లోకేష్ రాహుల్ కూడా 11 పరుగులకు అవుట్ అయ్యారు.  అయితే.. శివమ్ దూబే మాత్రం 30 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, 3 ఫోర్లతో చెలరేగి 54 పరుగులు చేశాడు.


 
బ్యాటింగ్ చేసినంత సేపు విండీస్ బౌలర్లను కంగారు పెట్టాడు. వాల్ష్ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. తొలి టీ20లో రాణించిన కోహ్లీ 19 పరుగులు చేసి విలియమ్స్ బౌలింగ్‌లో సిమ్మన్స్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులు, జడేజా 9 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ కాట్రెల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. రిషబ్ పంత్ 33, దీపక్ చాహర్ ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో విలియమ్స్‌కు 2 వికెట్లు, వాల్ష్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాట్రెల్, పియెర్, హోల్డర్‌కు తలో వికెట్ దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: