త్రివేండ్రం వేదికగా  భారత్ -వెస్టిండీస్ జట్ల మధ్య  జరిగిన  రెండో టీ 20లో  ఎనిమిది వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. మొదట  బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20ఓవర్ల లో  7వికెట్ల నష్టానికి 170పరుగులు చేసింది.  శివమ్ దూబే (54),రిషబ్ పంత్ (33*)రాణించారు. అనంతరం లక్ష్య ఛేదన దిగిన  విండీస్  18.3ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి  విజయాన్ని అందుకుంది. విండీస్  బ్యాట్స్ మెన్ లలో  సిమ్మన్స్ (67*),లెవీస్ (40),పూరన్ (38*)పరుగులతో అదరగొట్టారు. 
 
 
ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా  సారథి విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ఫీల్డింగ్  వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.  మొదట  బ్యాటింగ్ చేయడం కూడా  ఒక సమస్యే ,చివరి నాలుగు ఓవర్ల లో 40-45పరుగులు వరకు చేయాల్సివుండే కానీ 30పరుగులతోనే సరిపెట్టుకున్నాం. శివమ్ దూబే  ఇన్నింగ్స్  మమ్మల్ని పోటీలో నిలబెట్టింది కానీ ఫీల్డింగ్  వైఫల్యం వల్ల  మ్యాచ్ చేజారిపోయింది. ఇలాంటి ఫీల్డింగ్ తో ఎంత పెద్ద   స్కోర్  నైనా కాపాడుకోలేం. ఫీల్డింగ్ లో ఇంకా మెరుగవ్వాలి.  పిచ్ స్పిన్నర్ల కు సహకరిస్తుందని మాకు తెలుసు అందుకే ఎటాక్ చేయమని  శివమ్ దూబే ను పంపించాం. ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యిందని కోహ్లి అన్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: