నిన్నవెస్టిండీస్ తో జరిగిన రెండవ టి20 లో టీమిండియా ఓడిపోవడం జరిగింది. కాగా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కొందరు ఇండియన్ ప్లేయర్ల ఫీల్డింగ్ తప్పిదాలే కారణం అని, పలువురు నెటిజన్లు వారిపై పలు విధాలుగా ట్రోల్ల్స్ చేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకు 170 పరుగులు చేసింది. కాగా ఆ జట్టులో సిమన్స్ 45 బంతుల్లో 4 ఫోర్లు మరియు 4 సిక్సర్లతో 67 పరుగులు, ఎవిన్ లెవిస్ 35 బంతుల్లో 3 ఫోర్లు మరియు మూడు సిక్సర్లతో 40 పరుగులు చేసి, జట్టులో అత్యధిక పరుగులు సాధించిన వారీగా నిలిచారు. కాగా మన బౌలర్లలో దీపక్ చాహర్ 2, వాషింగ్టన్ సుందర్ 1, చాహల్ 1 చొప్పున వికెట్స్ తీశారు. 

 

కాగా వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో మన ఫీల్డర్లలో కెప్టెన్ కోహ్లీ ఎంతో అద్భుతంగా ఫీల్డింగ్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కానీ మధ్యలో కొందరు ప్లేయర్లు చేసిన పేలవమైన ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్ కొంత దెబ్బతినడంతో పలువురు నెటిజన్లు వారిపై విరుచుకుపడుతూ పలు మెమోలతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ట్రోల్స్ చేస్తున్నారు. ఓపెనర్ సిమన్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని ఆరంభంలోనే ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ వదిలేయగా, మరో ఓపెనర్ ఎవిన్ లావిస్ ఇచ్చిన క్యాచ్‌ని వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేజార్చాడు. 

 

అలానే ఆఖర్లోనూ నికోలస్ పూరన్ క్యాచ్‌ని మనీశ్ పాండే వదిలేయడంతో టీమిండియా ఇచ్చిన లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే సులభంగా ఛేదించేసింది. కాగా కొంతవరకు ఫీల్డింగ్ తప్పిదాల కారణంగానే టీమిండియా ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంగీకరించాడు. ఇక నెటిజన్లలో కొందరు ఈ విధంగా ఫీల్డింగ్ చేయడం పై కామెడీగా పోస్టులు చేస్తూ వారిపై విరుచుకుపడుతున్నారు. మొదటి మ్యాచ్ లో కూడా ఈ విధంగానే పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినప్పటికీ, కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమ్ గెలిపించాడని, కావున ఇకనైనా మన ప్లేయర్లు తమ తప్పిదాలను గ్రహించి ఫీల్డింగ్ సక్రమంగా చేయాలని వారు కోరుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: