వికెట్ కీపింగ్ లో ఆయన దిగ్గజం... మ్యాచ్  విజయం కోసం వ్యూహాలను రచించడంలో ఆయనకు ఎవరూ సాటి లేరు... ఓడిపోయే మ్యాచ్ ను  విజయ తీరాలకు చేర్చడంలో ఆయన బ్యాట్ కు  ఎవరు ఎదురు రాలేరు. టీమిండియాకు ఎన్నో విజయాలను అందించి క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న గొప్ప ఆటగాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. గత కొంత కాలంగా ధోని క్రికెట్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ అవబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కొన్ని రోజుల వరకు తనను ఏమీ అడుగొద్దంటూ  ఇప్పటికే ధోనీ క్లారిటీ కూడా ఇచ్చేశారు. 

 

 

 ఇదిలా ఉండగా తాజాగా ధోని  సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఓ టెలివిజన్ కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలిపాడు ధోని . వరల్డ్ కప్ తర్వాత క్రికెట్కు పూర్తిగా దూరంగా ఉన్న ధోని ఆర్మీలో చేరి కార్మికుల తో గడిపిన విషయం తెలిసిందే. భారత సైన్యంలో గౌరవ లెఫ్ట్నెంట్ కల్నల్ హోదా లో ధోనికి సైనికులు అత్యంత గౌరవం ఇచ్చారు. అయితే చాలా కాలం నుంచి సైన్యంలో ప్రస్థానం కొనసాగిస్తున్న మాజీ కెప్టెన్ ధోని...బార్డర్ లో  సైనికులు జీవితాలు వారి సమస్యలు స్థితిగతుల గురించి ఓ టెలివిజన్ షో నిర్వహించాలని నిర్ణయించారు. 

 

 

 

 ఈ షో ద్వారా భారత్ లో సైనికులు ఎలాంటి త్యాగాలు చేస్తారు... దేశ భద్రత కోసం ప్రజలందరి రక్షణ కోసం సైనికులు ఎంత కష్ట పడతారు అన్నది దేశ ప్రజలందరికీ తెలియాలి అన్నది ధోనీ ఉద్దేశం. దేశ బార్డర్ లో ఉండే సైనికులు వారి కుటుంబాల వాస్తవిక జీవితాలు ఎలా ఉంటాయో మహేంద్ర సింగ్ ధోనీ తన షో ద్వారా వివరించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయి ఛానల్ ద్వారా ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. కాగా ఈ షో ద్వారా ఆర్మీలో దేశ రక్షణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది  ఆర్మీ అధికారుల గురించి తెలిపి ఆర్మీ పై  ప్రజలకు మరింత గౌరవం కలిగించేలా చేయాలని ధోని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: