టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... ఇండియన్ ఆర్మీలో చేరి... విధులు నిర్వహించడం జరిగింది. రెండు వారాలపాటూ వాళ్లతోనే ఉండి... వాళ్ల కష్టాలు, దేశం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలూ అన్నీ కూడా  తెలుసుకోవడం జరిగింది. దేశ ప్రజల  కోసం అంత చేస్తున్న వాళ్ల కోసం మనం కూడా ఏదైనా చేస్తే చాల బాగుంతుంది అని ధోని ఆలోచించాడు. అప్పుడు ధోనికి  అదిరిపోయే కొత్త ఆలోచన వచ్చింది అదే టీవీ సిరీస్. 

 

టీవీ షో ద్వారా   టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్... అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డులు సాధించిన ఆర్మీ అధికారుల జీవితాల గురించి అక్కడి కష్టాలు, త్యాగాలు అన్ని కూడా  ప్రపంచానికి చాటి చూపించాలి అని అనుకున్నాడు ధోని. ఇక టీవీ షో మాత్రం  వచ్చే సంవత్సరం అందరి ముందుకు రాబోతుంది. 

 

ప్రస్తుతం మాత్రం  స్ర్కిప్ట్‌ వర్క్ కొనసాగుతుంది అని ధోని తెలిపారు. స్టూడియో నెక్స్ట్‌, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ కలిసి నిర్మిస్తున్నారు ఈ సిరీస్‌ని... ఈ షోని మాత్రం  సోనీ టీవీలో ప్రసారం అవుతుంది అని అందరికి తెలియచేసారు. ధోనీ  ఓ మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంపై అటు అభిమానులు ఇటు దేశ ప్రముఖులు, ఆర్మీ నుంచీ పాజిటివ్ స్పందన రావడం చాల ఆనందకరమైన విషయం.

 

ఇక ప్రపంచకప్‌ సెమీస్‌ తర్వాత ధోనీ స్టేడియంలోకి రాలేదు అన్న విషయం అందరికి తెలిసిందే కదా. ప్రపంచకప్ తర్వాత జరిగిన వెస్టిండీస్‌ టూర్‌కి కూడా పోలేదు. ఇందుకు ముఖ్యమైన  కారణం సైన్యంలో కలిసి ఉండాలి, వారితో పని చేయాలి అని తెలిపారు. ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకూ  పోలేదు. ఇలా సిరీస్‌లకు దూరమైనా ధోని... టీవీ షో ద్వారా అందరికీ  చాలా ఆనందకరమైన విషయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: