గత ఏడాది  వెస్టిండీస్ తో  జరిగిన  రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ తో  టెస్టుల్లోకి ఎంట్రీ   ఇచ్చి అరంగేట్రం లో  మ్యాచ్ లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు  టీమిండియా  యువ ఓపెనర్ పృథ్వీ షా.  ఇక రెండో  టెస్టు లోనూ  హాఫ్ సెంచరీ తో ఆకట్టుకోవడంతో  పృథ్వీ షా  ఆతరువాత  ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైయ్యాడు.  అయితే ప్రాక్టీస్ లో  గాయపడడం తో  అతను ఆసిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.  ఆతరువాత  సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 లో పాల్గొనడం, ఆ సమయంలో  గాయపడడంతో  కోలుకోవడం కోసం  తనకు  తెలియకుండానే   దగ్గు సిరప్ లో వుండే  నిషేదిత  పదార్థాన్ని వాడడం దాంతో  డోప్ టెస్ట్ లో  దొరికిపోవడంతో  బీసీసీఐ అతని పై నిషేధం  విధించిన సంగతి తెలిసిందే.  కాగా  నవంబరు 15 తోనే  పృథ్వీ షా  నిషేధం ముగిసింది.  దాంతో ఇటీవల  జరిగిన  సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20లో కూడా పృథ్వీ షా పాల్గొన్నాడు. 
 
 
 
ఇక నిషేధం తో  పృథ్వీ షా దూరం కావడం తో అతని స్థానంలో వచ్చిన  మయాంక్ అగర్వాల్  వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగా  మిడిల్ ఆర్డర్ నుండి ఓపెనర్ గా ప్రమోట్  అయ్యి  అంచనాలను మించి  రాణించడం తో  వీరిద్దరూ  ఓపెనర్లుగా  స్థిరపడిపోయారు. దాంతో  పృథ్వీ షా ను మళ్ళీ టెస్టు జట్టులోకి తీసుకుంటారనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే  అతన్ని  మూడో ఓపెనర్ గా ఎంపిక చేయనున్నారని  బీసీసీఐ వర్గాల నుండి సమాచారం వస్తుంది.  వచ్చే ఏడాది జనవరి లో భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటించాల్సి వుంది. ఈ టూర్ లో  టీమిండియా , కివీస్ తో వన్డే , టీ 20 తోపాటు  టెస్టు సిరీస్ ను కూడా ఆడాల్సివుంది. అందులో భాగంగా టెస్టు సిరీస్ కు  మూడో ఓపెనర్  గా పృథ్వీ షా ను ఎంపిక చేయనున్నట్లు  తెలుస్తుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: