ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా టీం ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. వాఖండే వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే టాస్ గెలిచిన విండీస్ భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భార‌త ఓపెనర్లు రోహిత్ శ‌ర్మ - కేఎల్‌.రాహుల్ నిర్దాక్షిణ్యంగా విండీస్ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు.

 

తొలి బంతి నుంచే వీర బాదుడు స్టార్ట్ చేశారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా స్కోరు 58. ఓపెనర్ రోహిత్ శర్మ 17 బంతుల్లో రెండు సిక్సర్లు నాలుగు ఫోర్లతో 34 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ 13 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో కలిపి 24 పరుగులు చేశాడు. ఇక కేవ‌లం 8 ఓవ‌ర్ల‌కే భార‌త్ జ‌ట్టు స్కోరు 100 ప‌రుగులు క్రాస్ చేసేసింది. రోహిత్ శ‌ర్మ‌, రాహుల్ ఇద్ద‌రు విండీస్ బౌల‌ర్లు బంతులు వేయ‌డ‌మే ఆల‌స్యం చిత‌క బాదుడు బాదేశారు.

 

10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్లు న‌ష్ట‌పోకుండా 116 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 63 ప‌రుగుల చేసి క్రీజ్ లో ఉన్నాడు. ఇక మ‌రో ఓపెన‌ర్ కేఎల్ .రాహుల్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 51 ప‌రుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. 

 

ఇక మూడో టీ 20 మ్యాచ్ సంద‌ర్భంగా ముంబై వాంఖ‌డే స్టేడియ వేలాది మంది భార‌త క్రికెట్ అభిమానుల‌తో హోరెత్తుతోంది. ప్రేక్ష‌కుల నుంచి స‌పోర్ట్ బాగా ఉండ‌డంతో మ‌న జ‌ట్టు ఓపెన్లు విధ్వ‌సం క్రియేట్ చేశారు. ఈ దూకుడు చూస్తుంటే భార‌త్ 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 200 ప‌రుగుల సులువుగా క్రాస్ చేస్తోంద‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: