ముంబైలో జరుగుతున్న వెస్టిండీస్ తో జరుగుతున్న ఆఖరి టీ - 20 లో భారత్ అదరగొట్టింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అదిరేపోయే  ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లే అయిపోయే సరికి వికెట్ నష్టపోకుండా భారత్ 72 పరుగులు చేసింది. మొదటి రెండు టీ - 20ల్లో విఫలమైన రోహిత్ శర్మ ముంబయి వాంఖెడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరిగిపోయాడు. 

 

 

విండీస్ బౌలర్ల అందరికి చుక్కలు చూపించాడు. మొదటి ఓవర్ నుంచే బౌలర్ల పై ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో తనదైన సిక్సర్ తో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అద్భుతమైన షాట్ లతో గ్రౌండ్ మొత్తం తనదైన మార్క్ బ్యాటింగ్ తో చెలరేగి పోయాడు. అయితే 12 వ ఓవర్ లో మరో భారీ షాట్ కు ప్రయత్నించి 71 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు. అతని వికెట్ పడడంతో విండీస్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

 

 

రోహిత్ కి తోడుగా కేయల్ రాహుల్ కూడా తనదైన శైలిలో ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 72 పరుగులు చేసింది. రాహుల్ అప్పర్ కట్ షాట్ కొట్టిన విధానం సెహ్వాగ్ ని గుర్తుకు తెచ్చింది. చూడచక్కనైన షాట్ లతో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు రాహుల్ ఆ తర్వాత కూడా అదే తరహాలో ఆడాడు. సెంచరీ చేసేలా కనిపించిన రాహుల్ 9 పరుగుల తేడాతో సెంచరీ మార్క్ చేరుకోలేకపోయాడు. 91 పరుగుల వద్ద చివరి ఓవర్ లో రాహుల్ వెనుతిరిగాడు.  

 

 

రోహిత్ అవుట్ అయ్యాక కోహ్లీ ఈసారి మరో మార్పు చేశాడు. పంత్ ను వన్ డౌన్ పంపించాడు. కానీ పంత్ మరోసారి విఫలమయ్యాడు. డక్ అవుట్ అయ్యి వచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంత్ అవుట్ అయ్యాక వచ్చిన కోహ్లీ మొదటి నుంచే విండీస్ బౌలర్ల పై విరుచుకు పడ్డాడు. అర్థశకంతో మరోసారి కోహ్లీ అదరగొట్టాడు. రాహుల్, కోహ్లీ చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి బంతిని సిక్సర్ గా మలిచి ఇన్నింగ్స్ ను తనదైన స్టైల్ లో ఫినిష్ చేశాడు కెప్టెన్ కింగ్ కోహ్లీ.

 

 

కాగా, టీ - 20ల్లో భారత్‌‌ కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2017 లో ఇండోర్‌ లో శ్రీలంక పై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016 లో లాడర్‌ హిల్‌ లో వెస్టిండీస్‌పైనే 244 రన్స్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో 240 పరుగులు చేసి మరోసారి విండీస్‌పై భారీ స్కోర్ సాధించింది.

 

 

ఇన్నింగ్స్ ముగిసే సరికి భారత్ స్కోర్ 20 ఓవర్లకు 240 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో రోహిత్ 71, రాహుల్ 91, పంత్ 0, కోహ్లీ 70 (నాటౌట్).

మరింత సమాచారం తెలుసుకోండి: