పెర్త్‌లో గురువారం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే  తొలి టెస్ట్  అలీమ్ దార్ కు  ఆన్-ఫీల్డ్  అంపైర్‌గా 129 వ టెస్ట్ మ్యాచ్ కాబోతుంది.  2003 లో  డాక టెస్ట్ మ్యాచ్ ద్వారా అంపైర్ గా అలీమ్ దార్  అరంగేట్రం చేసారు.  గురువారం పెర్త్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే  మొదటి టెస్ట్ మ్యాచ్‌ తో  పాకిస్తాన్ అలీమ్ దార్ అంపైర్‌గా స్టీవ్ బక్‌నోర్ చేసిన అత్యధిక టెస్ట్ మ్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టనున్నాడు.  పాకిస్తాన్‌  లో ఫస్ట్‌ క్లాస్ క్రికెట్ ఆడిన దశాబ్దం తర్వాత అంపైరింగ్ తీసుకున్న 51 ఏళ్ల అలీమ్ దార్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌  గా  తన 129 వ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. 

 

 

 

 

 

 

శ్రీలంకతో పాకిస్తాన్ స్వదేశీ వన్డే సిరీస్‌లో 2000 లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన దార్ 207 వన్డేల్లో అధికారికంగా అంపైర్ గా  వ్యవహరించాడు.  దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్ట్జెన్ ఖాతా లో గల  209  వన్ డే  మ్యాచ్‌ల రికార్డుకు  రెండు మ్యాచ్‌లు మాత్రమే దూరంగా దార్ వున్నాడు. దార్  46 టి 20 ఇంటర్నేషనల్స్‌లో కూడా అధికారికంగా అంపైర్ గా  వ్యవహరించారు.   నా అంపైరింగ్ కెరీర్ ప్రారంభించినప్పుడు నేను ఎప్పుడూ ఆలోచించని ఒక మైలురాయి ఇది.  నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో మైదానం లో  అడుగు పెట్టడం  ఒక  అద్భుతమైన అనుభూతి , ఇది  నా జీవితంలో ఒక ఉన్నత స్థానం  కలిగి వుంది  అని ఐసిసి ప్రకటనలో దార్ అన్నారు.

 

 

 

 

 

స్టీవ్ బక్నోర్ నాకు  స్ఫూర్తిదాయకం.  ఇప్పుడు అయన  కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో నేను అధికారికంగా అంపైర్ గా వ్యవహరించడం ఆనందంగా వుంది అని అన్నారు.  నా అంతర్జాతీయ దాదాపు రెండు దశాబ్దాల క్రికెట్  కెరీర్‌  లో, బ్రియాన్ లారా యొక్క400 నాటౌట్ టెస్ట్ నాక్,   దక్షిణాఫ్రికా 2006 లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు  434  వంటి కొన్ని చిరస్మరణీయ మ్యాచ్‌లు మరియు విజయాలు చూసే అదృష్టం నాకు కలిగింది  అని అన్నారాయన.

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: