వెస్టిండీస్ తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ - 20 లో భారత్ సమష్టి కృషితో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాలలో రాణించి వెస్టిండీస్ పై సిరీస్ సొంతం చేసుకుంది. మొదట టాస్ ఓడి, బ్యాటింగ్ కు దిగిన కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి మొత్తం 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

 

 

అందులో రోహిత్ శర్మ(71; 34 బంతుల్లో 6x4, 5x6), కేఎల్ రాహుల్(91; 58 బంతుల్లో 9x4, 4x6), విరాట్ కోహ్లి ( 70; 29 బంతుల్లో 4x4, 7x6) సిక్సుల మోత మోగించడంతో విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే అనంతరం ఛేదనకు దిగిన విండీస్ ఆదిలోనే ప్రధానమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

 

 

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయిర్(41), పొలార్డ్ (88) భారత బౌలర్ల పై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ కాసేపు పోరాడినా భారత బౌలర్లు కీలక టైంలలో వికెట్లు తీసి మ్యాచ్ ను తమవైపుకు తిప్పారు. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి మొత్తానికి 178 పరుగులు చేసింది. దీనితో టీమిండియా 67 పరుగులతో ఘన విజయం సాధించింది. 

 

 

భారత బౌలింగ్ విభాగంలో బౌలర్లు దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా లోకేష్ రాహుల్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా విరాట్ కోహ్లీ అవార్డులు అందుకున్నారు. అనంతరం మూడు టీ - 20 ల పేటియం ట్రోపిని భారత కెప్టెన్ విరాట్ కోహిలి అందుకున్నాడు.  

 

 

మొత్తానికి సొంతగడ్డపై తనకి తిరుగులేదని టీమిండియా మరోకసారి నిరూపించుకుంది. వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టీ - 20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ లోనూ అద్భుత ప్రదర్శన కనపరిచిన భారత్ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: