ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి అయిన ఆనమ్ మీర్జా వివాహ వేడుక ఘనంగా జరిగింది. బుధవారం రోజు ఆనమ్ మీర్జా, మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడైన అసద్ ను వివాహమాడింది. ఈ నూతన భార్య భర్తలు సామాజిక మాధ్యమాలలో వారి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ని అప్లోడ్ చేసి వారి మ్యారేజ్ అయినట్టు అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి వారి ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

https://www.instagram.com/p/B5-F8pbnhdq/?utm_source=ig_web_copy_link

నిజానికి మొట్టమొదటిగా వారి వివాహం గురించి చాలా సంతోషంగా తెలియజేసింది మాత్రం సానియా మీర్జానే. తాజాగా జరిగిన తన చెల్లి వివాహ వేడుకలలో కూడా సానియా మీర్జా చేసిన సందడి అంతా ఇంతా కాదు.

https://www.instagram.com/p/B57Np9MHgXb/?utm_source=ig_web_copy_link

అలాగే తాను వేసుకున్న దుస్తులు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ అక్క చెల్లెలు తమ అమ్మతో నవ్వుతున్న ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సానియా తన సంతోషాన్ని తన అభిమానులతో బాగా పంచుకుంటుంది.

https://www.instagram.com/p/B57ONeUnCRs/?utm_source=ig_web_copy_link

అయితే.. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోలో సానియా మీర్జా...   అసద్ ను ఇంటి బయట గేటు వద్ద అనుమతించకుండా... ' మూడు లక్షల రూపాయల ఇవ్వు' అంటూ అడుగుతుంది. దీంతో    చిరునవ్వే సమాధానంగా ఇస్తాడు ఆనమ్ మీర్జా భర్త. నిజానికి వివాహ సందర్భంగా... వరుడు తొలిసారిగా వధువు ఇంటికి వచ్చినప్పుడు ఆ వరుడిని కట్నం ఇవ్వమని అడుగుతారు. ఈ సాంప్రదాయం హిందూ, ముస్లిం కుటుంబాలలో ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆడపడుచుల కట్న వేడుక అని హిందువులు పిలిస్తే, థింగానా అని ముస్లిం కుటుంబాలలో పిలుస్తారు.


ఇకపోతే, ఈ వివాహ వేడుకలలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ హాజరయ్యారు. కెరీర్ పరంగా..ఆనమ్ మీర్జా ఫ్యాషన్ డిజైనర్ అయితే, భర్త అసద్ వర్ధమాన క్రికెట్ ఆటగాడు. ఇటీవల ఇతను రంజీ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. కాగా, ఆనమ్ మీర్జా కిి  ఇది రెండవ వివాహం. ఆమె గతంలో అక్బర్ రసీదును వివాహమాడి, ఆ తర్వాత కొన్ని కారణాల వలన విడాకులు తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: