వెస్టిండీస్ తో జరిగిన టీ ట్వంటి సిరీస్ ని గెలిచి జోష్ మీదున్న భారత్ వన్డేలకి సిద్ధం అవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు మొదటి వన్డే చెన్నై వేదికగా జరగనుంది. టీ ట్వంటీ సిరీస్ ని దక్కించుకున్న భారత్ వన్డే సిరీస్ ని కూడా కైవసం చేసుకోవాలని ఆరాట పడుతోంది. మరోవైపు వెస్టిండీస్ వన్డే సిరీస్ అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అయితే రేపు జరగబోయే వన్డేలో భారత జట్టులోకి మయాంక్ అగర్వాల్ చేరనున్నాడు.

 


ఈ సంవత్సరం టెస్టుల్లో అద్భుతంగా రాణించిన మయాంక్ అగర్వాల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మోకాలి గాయం కారణంగా సిరీస్ ఆడట్లేదు. అందువల్ల అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ని సెలెక్ట్ చేసింది మేనేజ్ మెంట్. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ ఎలా ఆడతాడన్న ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే దానికి మయాంక్ తన సమాధానాన్ని చెప్తున్నాడు.

 


ఇప్పటి వరకు టెస్ట్ ఫార్మాట్ లో ఆడాను. ఇకముందు వన్డేల్లో కూడా ఆడతాను. మన గేమ్ ప్లాన్ సరిగ్గా ఉంటే ఏ ఫార్మాట్ లో నైనా ఆడగలం. ఏ ఫార్మాట్ లో ఆడితే ఆ ఫార్మాట్ కి తగ్గట్టు మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. బేసిక్స్ ఏ ఫార్మాట్ లోనైనా ఒకే రకంగా ఉంటాయి. పరిస్థితులకి తగ్గట్టు ఆడటం నేర్చుకోవాలి. ఆ పరిస్థితికి తగిన విధంగా మన మైండ్ సెట్ ని మార్చుకుంటే ఏ ఫార్మాట్ లోనైనా రాణించగలం.

 


నేనెప్పుడు జట్టుకి ఏ విధంగా ఉపయోగపడతా అనేదే ఆలోచిస్తా. నేను బ్యాటింగ్ లో విఫలమయితే ఫీల్డింగ్ ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తా. ఏ రకంగానైనా జట్టుకు మేలు జరగడానికే ప్రయత్నిస్తా అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: