ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఏది..? అని అడిగితే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న క్రికెట్ స్టేడియం అని ఇప్పుడు చెబుతారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత మాత్రం దీనికి ఆన్స‌ర్ మార‌నుంది. ఎందుకంటే  మెల్‌బోర్న్‌లో ఉన్న క్రికెట్ స్టేడియాన్ని తలదన్నేలా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్టేడియంను నిర్మిస్తున్నారు. ఇది పంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని త్వరలో భారతదేశంలో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు అతి సమీపంలోని మొతేరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.

 

అయితే లక్షా పదివేలమంది కూర్చునే కెపాసిటీ కలిగిన ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్‌లో మరి కొద్దినెలల్లో సిద్ధమవుతోంది. రూ. 700 కోట్లకుపైగా వ్యయంతో అత్యంత అధునాతనంగా రూపుదిద్దుకుంటున్న ఈ సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో మొట్టమొదటి మ్యాచ్‌ 2020 మార్చిలో జరగనుంది. ఈ స్టేడియం విస్తీర్ణం అయిదో, ప‌దో కాదు.. ఏకంగా 63 ఎక‌రాలు. ఇంత పెద్ద స్థ‌లంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్థాయి విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న‌ క్రికెట్ స్టేడియం మ‌రెక్క‌డా లేదు.స్టేడియం నిర్మాణం 2017లో ప్రారంభమైంది.

 

ప్రస్తుతం దేశంలో పెద్ద స్టేడియంగా ఉన్న ఈడెన్‌ గార్డెన్స్ రికార్డును సర్దార్‌ పటేల్‌ స్టేడియం అధిగమించనుంది. ఆసియా లెవెన్‌, వరల్డ్‌ లెవెన్‌ జట్లు ఈ పోరులో తలపడనున్నాయి. స్టేడియంలో 70 కార్పొరేట్‌ బాక్సులు, నాలుగు డ్రెస్సింగ్‌ రూంలు, ఓ క్లబ్‌హౌస్‌, ఒలింపిక్‌ స్థాయి స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్నాయి. మొతెరాలో ఇప్ప‌టికే ఓ స్టేడియం అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. దీన్ని తొల‌గించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మ‌రియు మ‌రింత విస్త‌రిస్తున్నారు. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కలల ప్రాజెక్ట్‌ అయిన ఈ మైదానం పూర్తయితే.. భారత్‌కు ఖ్యాతి తీసుకొస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: