టీమ్ ఇండియా జట్టు వరుస సిరీస్లనూ  సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. టెస్ట్ వన్డే టి20 ఇలా అన్ని ఫార్మాట్లలో టీమిండియా జట్టు కు ఏ జట్టు కూడా ఎదురు నిలువలేక పోతుంది. ఇక వెస్టిండీస్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నట్లే అటు వెస్టిండీస్ టీం కూడా వరుస పరాజయాలతో దూసుకుపోతుంది. అసలు మైదానంలో చతికిలబడి పోతూ నిలదొక్కుకోవడం ఎలాగో అర్థం కాని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుకి . ఏకంగా ఇప్పటికే టీమిండియా వెస్టిండీస్ పై 9 సిరీస్లను గెలుచుకోవడం గమనార్హం. అయితే తాజాగా మరోసారి వెస్టిండీస్తో వన్డే మ్యాచ్ జరగనుండగా 9 సిరీస్లను రౌండప్ చేయాలని టీమిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన టి20 మ్యాచ్ లో మూడు మ్యాచ్ లలో  గెలిచి  అఖండ విజయాన్ని నమోదు చేయాలని భావించింది టీమిండియా. 

 

 

అయితే రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా కు షాక్ ఇస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కరేబియన్ టీం. ఇక ఆ తర్వాత అలర్టు అయిపోయిన టీమిండియా మూడో మ్యాచ్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు జరగబోయే వన్డేలో మాత్రం మూడు మ్యాచ్లో గెలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకోవాలని దృఢ నిశ్చయంతో ఉంది టీమిండియా. కాగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ వన్డే మ్యాచ్ జరుగనుంది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలు కానుంది.టీమ్ ల వారీగా అంచనాలు వేసుకుంటే... టీమిండియా అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. బౌలర్ల విషయంలో..  బ్యాట్ మెన్స్  విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇస్తూ ముందుకు సాగుతుంది టీమిండియా.. అయితే అటు వెస్టిండీస్ టీం వరుస అపజయాలను సొంతం చేసుకున్నప్పటికీ.. ఆ టీమ్ నూ  తక్కువ అంచనా వేయడానికి లేదు. 

 

 

 కరేబియన్స్  ఎప్పుడు విజృంభించి ఆడతారో  ఎవ్వరికి తెలియదు. ఒకసారి మైదానంలో కుదురుకున్నారు అంటే సిక్సర్ల మోత మోగించేస్తారు . అయితే ఇప్పటికే టీమిండియాతో చాలా అపజయాలను మూటగట్టుకున్న కరేబియన్ జట్టు ఎలాగైనా ఈ వన్డే సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉంది. దీనికోసం టీమిండియా పై ఒత్తిడి పెంచేందుకు సరికొత్త వ్యూహాలతో కరేబియన్ జట్టు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే అఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండు  వన్డేలోనూ క్లీన్స్వీప్ చేసింది కరీబియన్ జట్టు. దీంతో కరేబియన్ జట్టును తక్కువ అంచనా వేయకుండా టీమిండియా సరికొత్త వ్యూహాలతో దూసుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే చెన్నైలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఈ రోజు వర్షం కురువదు  అని సమాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: