ఇప్పటివరకు ఎక్కువగా టెస్టులు మరియు టి20 మ్యాచులు ఆడిన టీమ్ ఇండియా జట్టు, నేడు చాలా గ్యాప్ తరువాత వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్ లో పాల్గొనబోతోంది. చెన్నై లోని చపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ వన్డే మ్యాచ్ కి ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయినట్లు తెలుస్తోంది. చెన్నై పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో చాహార్, రవీంద్ర జడేజా లను ఎక్కువగా వినియోగించుకోవాలని చూస్తున్నాడు కెప్టెన్ కోహ్లీ. ఇక ఆ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు యావరేజ్ పరుగులు 240 లోపే ఉండడంతో, 

 

ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వెస్టిండీస్ కి లభిస్తే, వారిని స్పిన్నర్ల సాయంతో ధీటుగా ఎదుర్కోవాలని చూస్తోంది ఇండియా. ఇక ఇండియా జట్టులో భువనేశ్వర్ కుమార్ మరియు శిఖర్ ధావన్ గాయాలపాలవగా వారి స్థానంలోకి మయాంక్ అగర్వాల్ మరియు శార్ధూల్ లను తీసుకున్నారు. అయితే ఫైనల్ గా పదకొండు మంది జట్టులో వీరికే అవకాశం లభించడం కష్టంగా కనపడుతోంది. బ్యాటింగ్ పరంగా కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కొంత ఫామ్ లో ఉండడం మనకు కలసి వచ్చే అంశంగా కనపడుతోంది. 

 

అలానే కరేబియన్ జట్టులో పోలార్డ్, పూరాన్, లూయిస్ ఇటీవల జరిగిన టీ20 ల్లో బాగానే తమ బ్యాటింగ్ ప్రతిభను కనబరిచారు. బౌలింగ్ విభాగంలో వాల్ష్ ఒక్కడే ఒకింత చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ కనబరిచాడు. కాగా ఇప్పటివరకు చెపాక్ స్టేడియంలో 21 మ్యాచులు జరుగగా, అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 13 సార్లు గెలవడం జరిగింది. దానిని బట్టి ఈ మ్యాచ్ కు టాస్ కూడా ఒకింత కీలకం కానుంది. ఇక ఓవర్ ఆల్ గా చూస్తే, మొదట బ్యాటింగ్ చేసిన జట్టుని బౌలింగ్ చేసే జట్టు, స్పిన్నర్ల సాయంతో ఒకింత తక్కువ స్కోర్ కు కట్టడి చేయగలిగితే వారికి విజయావకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: