ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్... ఇంకోవైపు ఎలాగైనా భారత్ ను ఓడించి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న వెస్టిండీస్. ఇప్పటికే టెస్ట్..  టి20.. వన్డే సిరీస్ ఇలా అన్ని ఫార్మాట్లలో సిరీస్  గెలుచుకుంటు  దూసుకుపోతుంది టీమ్ ఇండియా . బౌలింగ్ పరంగా.. బ్యాటింగ్  పరంగా.. ఫీల్డింగ్  పరంగా ఇలా అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉంది టీమిండియా. దీంతో టీమిండియా దూకుడు ముందు ఏ టీం లో కూడా నిలదొక్కుకోలేక పోతున్నది . వెస్ట్ ఇండీస్ టీం గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వరుసగా టీం ఇండియా చేతిలో పరాజయం పాలవుతూనే ఉంది. కాగా ఇప్పటికే టీ20 మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడిన టీమిండియా... సిరీస్ను కైవసం చేసుకుంది. 

 

 

టి20 లో మూడు మ్యాచ్లు గెలిచి తన సత్తా చాటేందుకు బరిలోకి దిగిన అప్పటికీ.. సిరీస్లో రెండో మ్యాచ్ మాత్రం టీమ్ ఇండియాకి  షాక్ ఇస్తూ వెస్టిండీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత అలెర్ట్ అయిపోయిన టీమిండియా మూడో మ్యాచ్లో విజయం సాధించి టి20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ తో తలపడనున్న టీమిండియాను ఈసారి ఎలాగైనా మూడు మ్యాచ్లు గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే వన్డే మ్యాచుల్లో కరేబియన్ జట్టుని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన  కరేబియన్ జట్టు బంగ్లాదేశ్ జట్టును  క్లీన్ స్వీప్ చేసింది. 

 

 

 

 ఇదిలా ఉంటే ఈరోజు జరగబోయే వన్డే మ్యాచ్ కి ఓ ప్రత్యేకత కూడా ఉందండోయ్.. అదేంటంటే ఇప్పుడు వరకు అటు టీమిండియా క్రికెట్ వెస్టిండీస్ ప్రపంచ వన్డే టైటిల్ను చెరో రెండు గెలుచుకున్నాయి ఈ రెండు జట్లు. ఇకపోతే  ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో సైతం సమఉజ్జీలు గానే ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 130 మ్యాచ్ లలో తలపడగా.. 62 విజయాలతో ఈ రెండు జట్లు సమవుజ్జీ గానే ఉన్నాయి. దీంతో ఈ సిరీస్ లో ఎవరు ఆధిపత్యాన్ని సాధిస్తారా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వన్డే సిరీస్ను గెలుచుకోవాలని అటు టీమ్  ఇండియా.. ఇటు వెస్టిండీస్ జట్లు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా  ఈరోజు జరిగిన మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు వన్డే మ్యాచ్లో ముఖాముఖి లో ఆధిపత్యం సాధించడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ ఆధిపత్యాన్ని కోహ్లీసేన సాధిస్తుందా లేక పొలార్డ్ సేనా సాధిస్తుందా అన్నది వేచి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: