నాలుగు మాసాల విరామం తర్వాత తొలివన్డే సిరీస్ కు సిద్ధమైన 2వ ర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ విండీస్ ను మరోసారి చిత్తు చేయటానికి ఉరకలేస్తోంది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్ ల్లో నెగ్గుతూ వచ్చిన భారతజట్టు, వరుసగా 10 వ సిరీస్ విజయానికి ఉరకలేస్తోంది. ప్రస్తుతం జరుగనున్న ఈ10వ సీరిస్ కూడా నెగ్గితే, వరుసగా పది సిరీస్ ల విజయాలతో అత్యద్భుత రికార్డుని భరత్ జట్టు సృష్టించినట్లే. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా జరుగుతున్న సిరీస్ ల పరంపరలో ఇది ఒకటిగా ఉన్నా, 

 

దీనికి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక నేడు చెన్నైలోని చపాక్ స్టేడియం  వేదికగా జరుగబోయే తొలి వన్డేకు భారత్ మరియు వెస్టిండీస్ జట్లు రెండూ కూడా అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నాయి. ఎక్కువగా స్పిన్ కి అనుకూలించే చపాక్ స్టేడియంలో ఇరు జట్ల కెప్టెన్లు విజయం కోసం పలు విధాలుగా వ్యూహాలు పన్నుతున్నాయి. ఒక వైపు భారత కు ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ సహా కెప్టెన్ కోహ్లీ కూడా మంచి ఫామ్ లో ఉండడంతో పాటు బౌలింగ్ విభాగంలో కూడా పర్వాలేదనిపించేలా పేసర్లు రాణిస్తుండడం కొంత కలసి వచ్చే అంశం అని, 

 

అయితే ఫీల్డింగ్ విషయమై మాత్రం భారత జట్టు మరింత శ్రద్ధ పెట్టవలసి ఉంది అంటున్నారు క్రీడా నిపుణులు. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే, పోలార్డ్ మరియు లూయిస్, పూరాన్ మొన్నటి టి20 ల్లో బాగానే తమ ప్రతిభను కనబరిచారు. ఇక బౌలింగ్ విభాగంలో యువ బౌలర్ వాల్ష్ తప్పితే మిగతా బౌలర్లు ఎవరూ కూడా రాణించలేకపోవడం వారికి ఇబ్బందిని కలిగించే అంశం. మరి ఈ రోజు జరుగనున్న ఈ తొలి వన్డేలో ఏ జట్టు ఎంత మేర ప్రతిభను కనబరుస్తుందో, ఏ జట్టు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: