విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్లిద్దరు ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు రెండు కళ్లు లాంటివాళ్ళు. గత మూడు సంవత్సరాల నుంచి వన్డే, టి20 క్రికెట్ లో భారతదేశ క్రికెట్ జట్టు బాధ్యతని వీరి భుజస్కంధాలపై మోస్తున్నారు. మొన్న జరిగిన వెస్టిండీస్ టి20 మ్యాచ్ లలో కూడా ఇద్దరు మంచిగా రాణించారు. రోహిత్ శర్మ ఈ సంవత్సరం జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో ఏకంగా ఐదు సెంచరీలు కొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు.

 

ఇక విరాట్ కోహ్లీ కూడా సెంచరీలు చేయకపోయినా మంచి పరుగులు చేసి జట్టు విజయాలకి తన వంతు సహకారం చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్ టూర్లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలతో విజృంభించాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఒక సమస్య వచ్చింది ఈ సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పోటీ జరుగుతుంది. ఈ పోటీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కన్నా ఒక అడుగు ముందు ఉన్నాడు అని చెప్పాలి.

 

 ఈ సంవత్సరం రోహిత్ శర్మ టెస్టుల్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 2011,2017,2018 సంవత్సరాలలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఈ సంవత్సరం కూడా విరాట్ కోహ్లీ మొదటి స్థానం పొందితే క్రికెట్ చరిత్రలో నాలుగు సంవత్సరాలు మొదటి స్థానంలో నిలిచిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టిస్తాడు విరాట్ కోహ్లీ. కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్నారు.

 

మొన్న జరిగిన టి20 సిరీస్ లో కూడా వీరిద్దరూ చివరి టి20 తర్వాత టి-20 ఇంటర్నేషనల్ లో సమానమైన పరుగులు చేసి ఉన్నారు ఇరువురు. అలాగే అన్ని ఫార్మాట్లలో కలిపి కూడా వీరిద్దరి మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. గత మూడు సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి మొదటి స్థానంలో నిలుస్తున్నాడు. కానీ ఈ స్థానం కోసం కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య పోటీ గట్టిగానే సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: