టీమిండియాలో ఎంతో మంది గొప్ప ఆటగాడు ఉన్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు . వీరిద్దరూ ఒకరికి ఒకరు దీటుగా ఆడుతూ ఉంటారు. ఒకరు ఓ మ్యాచ్లో పైచేయి సాధిస్తే... ఇంకొకరూ  ఇంకో మ్యాచ్ లో పై చేయి  సాధించి మొత్తంగా టీమిండియాకు భారీ స్కోరును అందిస్తూ వుంటారు ఇద్దరు ఆటగాళ్లు . టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సొగసైన షాట్లతో  భారీ  చేరుతుంటే  వైస్  కెప్టెన్ సిక్సుల  వీరుడు... డబుల్ సెంచరీలు ధీరుడు రోహిత్ శర్మ సిక్స్ లతో హోరెత్తి భారీ స్కోరును నమోదు చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఆటగాళ్లు  ఎవరికి వారే సాటి అన్నట్లుగా మైదానంలో విజృంభిస్తు  ఉంటారు. టీమ్ ఇండియా కి గొప్ప విజయాలను సాధిస్తూ ఉంటారు. 

 

 

 

 ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య గట్టిపోటీ నెలకొంది. అది టీమ్ లో అనుకుంటున్నారా.. కాదు కాదు వీళ్ళు చేసిన పరుగుల విషయంలో. ఇద్దరు పరుగులలో పోటీ పడుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి కానుండటంతో ఈ సంవత్సరం లో ఎవరు ముందు ఉంటారు అనేది ప్రస్తుతం అభిమానుల్లో  ఆసక్తికరంగా మారింది. ఓవైపు విరాట్ కోహ్లీ తన ఆటతో విజృంభించి పరుగుల వరద పారిస్తు  ఉంటే.. మరోవైపు రోహిత్ శర్మ బౌలర్ల  కూడా వెన్నులో వణుకు పుట్టిస్తూ భారీ స్కోరును నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఈ ఇద్దరిలో ఎవరు ఉండబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 

 

 

 అయితే పరుగుల యంత్రం డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డు సాధించిన విషయం తెలిసిందే. క్రికెట్ దిగ్గజాలు సాధించిన రికార్డును సైతం తక్కువ సమయంలోనే సాధించాడు విరాట్ కోహ్లీ. అయితే ప్రస్తుతం విరాట్  మరో రికార్డు చేరువలో ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీకి టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో గట్టి పోటీ ఉంది. 2011, 2017 2018 సంవత్సరాలు విరాట్ కోహ్లీ...వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 

 

 

 

ఇప్పుడు కూడా 2019 లో  రికార్డు సాధించడానికి చేరువలో ఉన్నారు కోహ్లీ . ఇప్పటికి వన్డేల్లో విరాట్ కోహ్లి 1288 పరుగులు సాధించారు.  రోహిత్ శర్మ 1232 పరుగులతో కోహ్లి చేరువలో ఉన్నారు. కేవలం యాభై ఆరు పరుగుల తేడా మాత్రమే ఈ ఇద్దరి మధ్యే ఉంది.ఈ ఇద్దరి  ఆట తో పోల్చితే 56 పరుగులు పెద్ద తేడా ఏమీ కాదు. టీమ్ ఇండియా వెస్టిండీస్ తో  వన్డే మ్యాచ్ ఆడుతుండగా ఈ మ్యాచ్లో విరాట్ పరుగుల వరద పారించి  మరోసారి రికార్డు సాధిస్తాడా  లేక ఈసారి రోహిత్  శర్మ  రికార్డు ఎగరేసుకు పోతాడా  అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: