క్రికెట్ అన్నాక సర్వసాధారణంగా దెబ్బలు కూడా తాకుతాయి. బౌలర్ వేసిన బంతివల్లనో, లేదా క్యాచ్ పట్టేటప్పుడో, లేదా పరుగులు తీసేటప్పుడో ఏదో ఒక సమయంలో గాయపడటం జరుగుతుంది. ఇక అంపైర్లు గాయపడటం అనేది చాలా అరుదుగా చెప్పవచ్చూ. ఇలాంటి సంఘటనే  ఇప్పుడు జరిగింది. అదేమంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఇప్పటివరకూ ఆటగాళ్లు మాత్రమే గాయాల బారిన పడగా, ఇప్పుడు అంపైర్ అలీమ్ కూడా గాయపడ్డారు.

 

 

తొలి రోజున లాకీ ఫెర్గూసన్, రెండో రోజు హేజిల్ వుడ్ గాయాల పాలవగా, మూడో రోజున అంపైర్ గా విధుల్లో ఉన్న అలీమ్ కు కూడా గాయమైంది. దీంతో ఆయన నొప్పితో విలవిల్లాడుతూ కింద కుప్పకూలారు. ఇదేలా జరిగిందంటే న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ బంతిని వేయగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ దాన్ని డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బర్న్ సింగిల్ కోసం ట్రై చేయగా, బౌలర్ సౌధీ బంతిని అందుకుని త్రో వేశాడు. ఈ క్రమంలో బంతిని పట్టుకునే క్రమంలో మరో ఆటగాడు శాంట్ నర్ ఫీల్డ్ అంపైర్ అలీమ్ ను బలంగా ఢీకొన్నాడు.

 

 

దీంతో అతని మోకాలికి గాయమైంది. ఇకపోతే నొప్పితో అలీమ్ కింద పడిపోగా, అతనికి ఫిజియో చికిత్స చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గాయం కారణంగా ఏర్పడిన నొప్పిని భరిస్తూ కూడా, అతను అంపైరింగ్ చేశాడు. ఇకపోతే ఇప్పటివరకూ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా 129 మ్యాచ్ లలో బాధ్యతలు నిర్వర్తించిన అలీమ్, మైదానాన్ని వీడి బయటకు వచ్చే సమయంలో వీక్షకులు చప్పట్లతో ప్రశంసించారు. ఇకపోతే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆటగాళ్లు గాయడటం మాత్రమే జరిగేది కాని ఇప్పుడు ఒక అంపైర్ గాయపడటం ఇలా ముగ్గురు గాయల పాలవ్వడం నిజంగా బ్యాడ్ లక్ అంటున్నారు ఆటగాళ్లూ..

మరింత సమాచారం తెలుసుకోండి: