గత కొన్ని రోజుల నుండి వెస్టిండీస్ మరియు భారత జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇప్పటికే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రపంచ క్రికెట్ బ్యాటింగ్ చేసే వారిలో అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తిగా ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉండటం జరిగింది. ఇదే తరుణంలో రెండో బ్యాట్స్మన్ గా విరాట్ తర్వాత రోహిత్ శర్మ ఉన్నారు. ఇద్దరి మధ్య కేవలం కొద్దిపాటి పరుగుల తేడా మాత్రమే ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో 2019 సంవత్సరం ముగియనున్న క్రమంలో భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డే ఇద్దరి మధ్య మంచి పోటీ వాతావరణాన్ని నెలకొల్పింది.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఇండియన్ బ్యాటింగ్ దిగి మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 80 పరుగుల దగ్గర జోసెఫ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(36) అవుటయ్యాడు. ఆరు ఫోర్లతో మంచి జోరుమీదున్న రోహిత్‌.. హాఫ్ సెంచరీ ఖాయమనుకుంటున్న సమయంలో పోలార్డ్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్, రిషబ్ పంత్ ఉన్నారు. జట్టు స్కోర్ 21 ఓవర్లకు మూడు వికెట్లకు 86 పరుగులు.

 

విండీస్ బౌలర్లలో కాట్రెల్ రెండు వికెట్లు, జోసఫ్ ఒక వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న అయ్యార్, రిషిబ్ పంత్ ఊపు చూస్తుంటే అర్థ సెంచరీ కొట్టడం ఖాయం అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా స్కోర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్ లో మొదలైన ఈ రోజు మొదటి వన్డేలో భారత్ దూకుడుగా ఆడటం మొదలు పెట్టింది. మొత్తం మీద క్రీజ్లో ఉన్న కుర్రాళ్ల బ్యాటింగ్ జోరు చూస్తుంటే భారీ స్కోరు దిశగానే స్కోర్ బోర్డ్ నిలబడే టట్లు కనబడుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: